»   » కోర్టు కేసు: దర్శకుడు రాజమౌళి తండ్రికి ఊరట

కోర్టు కేసు: దర్శకుడు రాజమౌళి తండ్రికి ఊరట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పై గత కొంత కాలంగా చెక్ బౌన్స్ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ మీద సినీ నిర్మాత, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు దాఖలు చేసారు. ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది.

2011లో విజయేంద్రప్రసాద్ ఇచ్చిన రూ. 30 లక్షల ఆంధ్రాబ్యాంకు చెక్కు బౌన్స్ కావడంతో నిర్మాత వెంకట్రావు ఏజెఎఫ్ సీఎం కోర్టులో కేసు వేసారు. వాదోపవాదాల అనంతరం సరైన ఆధారాలు లేని కారణంగా విజయేంద్రప్రసాద్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Vijayendra Prasad deforestation on the check bounce case

విజయేంద్రప్రసాద్ సినిమాల వివరాలు...
బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న రైటర్ విజయేంద్ర ప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన దాదాపు 40 స్క్రిప్టులు రెడీ చేస్తున్నారట. ‘ఇదొక నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా నేను రాస్తూనే ఉంటాను. అందులో కొన్ని మాత్రమే వెండి తెరకు వస్తాయి అని చెప్పుకొచ్చారు' 72 సంవత్సరాల ఈ రైటర్.

ఓ ప్రముఖ దిన పత్రికతో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... ‘బాహుబలి-3' గురించి క్లూ ఇచ్చారు. వాస్తవానికి బాహుబలి రెండు భాగాలతోనే ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ స్వయంగా దర్శకుడు రాజమౌళి బాహుబలి-3 కూడా ఉంటుందని ప్రకటంచడంతో అంతా స్టన్నయ్యారు.

బాహుబలి సినిమాకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన రావడంతో .... ‘బాహుబలి' సీక్వెల్స్ కొనసాగించాలని నిర్ణయించారు. అయితే బాహుబలి-1, బాహుబలి-2 కథలతో పెద్దగా సంబంధం లేకుండా ‘బాహుబలి-3' సినిమా ఉండబోతోంది. ‘బాహుబలి-3' ఉంటుంది కానీ.... పార్ట్-1, పార్ట్-2లతో సంబంధం లేకుండా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్.

ఇక త్వరలో రాబోతున్న ‘బాహుబలి-2' గురించి వెల్లడిస్తూ.... ‘బాహుబలి-ది బిగినింగ్' సినిమాలో సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నకుల ‘బాహుబలి-ది కంక్లూజన్'లో సమాదానం దొరుకుతుందని, బాహుబలి తొలి భాగంలో మొదలైన స్టోరీ రెండో పార్టులో ముగుస్తుందని తెలిపారు.

English summary
Baahubali writer Vijayendra Prasad deforestation on the check bounce case.
Please Wait while comments are loading...