»   » పవన్‌తో కలిసి పనిచేస్తా.. ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం..

పవన్‌తో కలిసి పనిచేస్తా.. ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం..

Written By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ నటించిన భజరంగీ భాయ్‌జాన్ చిత్రానికి కథ అందించడంతో విజయేంద్ర ప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో కథా రచయితగా ఆయన ఇమేజ్ ఎల్లలు దాటింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మణికర్ణిక (ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ) చిత్రానికి రైటర్‌గా పనిచేస్తున్నాడు. బాహుబలి2లో ఇంటర్వెల్ సీన్‌కు పవన్ కల్యాణ్ స్ఫూర్తి అని విజయేంద్రప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు అనుకూలిస్తే పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తానని ఆయన అనడం గమనార్హం.

నిజాయితీ, వ్యక్తిత్వం అంటే నాకిష్టం

నిజాయితీ, వ్యక్తిత్వం అంటే నాకిష్టం

పవన్ కల్యాణ్ నిజాయితీ, వ్యక్తిత్వం అంటే నాకిష్టం. అలాంటి పవన్ కోసం ఎందుకు కథ రాయను. తప్పకుండా రాస్తా. బహుశా అతి త్వరలోనే పవన్‌తో కలిసి పనిచేస్తానేమో అని హింట్ ఇచ్చారు విజయేంద్రప్రసాద్. భజరంగీ భాయ్‌జాన్, బాహుబలి లాంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఒకవేళ పవన్‌ కోసం కథ రాస్తే అభిమానులకు పండుగే పండుగ అని చెప్పవచ్చు.

దేవుడే దిగి వచ్చినా

దేవుడే దిగి వచ్చినా

ప్రస్తుతం పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ సినిమా టైటిల్‌ గురించి రకరకాల పేర్లు ఫిలింనగర్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చినా', ‘ఇంజినీరింగ్‌ బాబు', ‘మాధవుడు' లాంటి టైటిల్స్‌ వైరల్ అవుతున్నాయి. తాజాగా ‘గోపాల కృష్ణుడు', ‘గోపాలుడు' అనే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే గోపాలా గోపాలా అనే సినిమాలో పవన్ నటించారు. అందువల్ల ఈ సినిమా టైటిల్ గోపాలుడు, గోపాలకృష్టుడు అనే టైటిల్స్ పెట్టకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

త్రివిక్రమ్‌ సినిమాపై పవన్ కల్యాణ్

త్రివిక్రమ్‌ సినిమాపై పవన్ కల్యాణ్

ఇక త్రివిక్రమ్‌ సినిమాపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఒకవైపు రాజకీయాలపై నిత్యం చర్చిస్తునే సినిమాని పూర్తి చేయడానికి చొరవ తీసుకొంటున్నారు. ఈ సినిమాలో ఫైట్స్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. గతంలో తాను నటించిన కొన్ని సినిమాలకు, చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ ఫైట్‌ను పవన్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే.

పవన్‌ ఓ పోరాట ఘట్టంలో

పవన్‌ ఓ పోరాట ఘట్టంలో

త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌, కథానాయిక కీర్తి సురేష్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి పవన్‌ ఓ పోరాట ఘట్టంలో నటించబోతున్నట్టు తెలిసింది. ప్రత్యేకమైన ఆ పోరాటం కోసం విదేశాల నుంచి వచ్చిన ఓ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ దగ్గర పవన్‌ శిక్షణ కూడా తీసుకొన్నట్టు సమాచారం.

English summary
As a Baahubali story writer Vijayendraprasad is well known to everyone in the film industry. He said recently that If situation favours, I am ready to work Pawan Kalyan. Pawan is now working with Trivikram Srinivas's movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu