»   » విజయేంద్రప్రసాద్ డైరెక్షన్లో సైంటిఫిక్ థ్రిల్లర్..

విజయేంద్రప్రసాద్ డైరెక్షన్లో సైంటిఫిక్ థ్రిల్లర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘జానకిరాముడు, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు' సహా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి కథను అందించిన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ ఏడాది భారతదేశం గర్వించే స్థాయిలో రూపొందిన విజువల్ వండర్ ‘బాహుబలి', బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘భజరంగీ భాయ్జాన్' చిత్రాలకు కూడా కథలను అందించారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి'తో రచయితగా తన పవర్ చాటిన విజయేంద్రప్రసాద్ ఈ ఏడాదినే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘భజరంగీ భాయ్ జాన్' చిత్రానికి స్టోరీని అందించి బాలీవుడ్ కి కూడా తెలుగువాడి సత్తాను చాటారు. రచయితగానే కాకుండా విజయేంద్రప్రసాద్ ‘రాజన్న' వంటి హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. రేష్మాస్(Reshma's)ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ కుమార్ బృందావన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌జ‌త్‌క‌ష్ణ‌, మిస్ ఇండియా నేహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో తుది దశకు చేరుకుంది.

Vijayendra Prasad’s Sci-fi Thriller

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కుమార్ బృందావన్ మాట్లాడుతూ ... "విజయేంద్రప్రసాద్ గారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన కథలను అందించడమే కాకుండా దేశభక్తి కూడుకున్న ‘రాజన్న' వంటి చిత్రాన్ని డైరెక్షన్ చేశారు. రీసెంట్ ‘బాహుబలి', ‘భజరంగీ భాయ్ జాన్' వంటి రెండు సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు కథలను కూడా అందించి నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యారు. అలాంటి గొప్ప రచయిత, దర్శకుడుతో కలిసి మా బ్యానర్ లో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. చాలా డిఫరెంట్ పాయింట్ తో ఈ కథను విజయేంద్రప్రసాద్ గారు సిద్ధం చేశారు అన్నారు.

కథ వినగానే వెంటనే సినిమా చేయడానికి రెడీ అయ్యాం. ప్రధానంగా ఈ చిత్రం ఒక సైంటిఫిక్ థ్రిల్లర్. ఇప్పటి వరకు మన తెలుగులో సైంటిఫిక్ చిత్రాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం వాటన్నింటికంటే భిన్నంగా ఎక్సలెంట్ స్టోరీ, టేకింగ్ అండ్ మేకింగ్‌లతో రూపుదిద్దుకుంటుంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. సినిమా చాలా బాగా వస్తుంది. మా యూనిట్ అంతా చాలా ఎగ్జయిటెడ్ గా ఉన్నాం. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

English summary
Vijayendra Prasad’s Sci-fi Thriller getting done is three languages Tamil, Telugu and Kannada and the makers are confident as it can make a mark of one of its own kind with a stimulating story line. The story has impressed Sukumar, the well known director is producing the movie in association with RESHMA’s arts Rajkumar. So, gear up for a scientific thriller soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu