»   » రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు ప్రతిష్టాత్మక అవార్డు

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు ప్రతిష్టాత్మక అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినీమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్. 61వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇటీవల ముంబైలో జరిగింది. ఈ సారి అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సత్తా చాటారు. భజరంగీ భాయిజాన్ సినిమాకు గాను ఉత్తమకథకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.

ఇతర అవార్డుల విషయానికొస్తే....సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘బాజీరావు మస్తానీ' చిత్రం పలు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్ర కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకోగా సంజయ్‌లీలాభన్సాలీ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు.

Vijayendra Prasad wins Filmfare!

పీకూ చిత్రానికి దీపికా పదుకొణె ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. మరోవైపు క్రిటిక్స్‌ విభాగంలో అమితాబ్‌ బచ్చన్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ‘పీకూ' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ ' చిత్రంలోని ఉత్తమ నటనకు కంగనారనౌత్‌ ఉత్తమ నటి అవార్డు అందుకొంది.

బజరంగీ భాయీజాన్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న తెలుగు కథారచయిత విజయేంద్రప్రసాద్‌ ఉత్తమ కథా రచయిత అవార్డు గెలుచుకున్నారు. సల్మాన్ హీరోగా తెరకెక్కిన భజరంగీ బాయిజాన్ సినిమాకు మూల కథను అందించి సక్సెస్‌లో సగభాగం అయ్యారు ఈ స్టార్ రైటర్. భారత్ లో తప్పి పోయిన పాకిస్థాన్ బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చే క్రమంలో కథానాయుడు ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది.

English summary
Telugu senior most writer, 'Vijayendra Prasad' has won the prestigious Filmfare Award for the for the bollywood flick 'Bajrangi Bhaijaan'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu