»   »  మనం, 24... డైరెక్టర్ విక్రమ్ కుమార్ పెళ్లి సెట్టయింది, ఈవిడే..(ఫోటో)

మనం, 24... డైరెక్టర్ విక్రమ్ కుమార్ పెళ్లి సెట్టయింది, ఈవిడే..(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇష్క్, మనం, 24 చిత్రాలతో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఇంతకాలం అతని పర్సనాలిటీ చూసి ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలియని వారంతా అతనికి పెళ్లి అయి ఉంటుందని భావింవచారు. కానీ మనోడు ఇంకా బ్యాచిలరేనంట. తాజాగా విక్రమ్ కుమార్ పెళ్లి సెట్టయింది. 27 ఏళ్ల సౌండ్ డిజైనర్ శ్రీనిధి వెంకటేష్ ను ఆయన పెళ్లాడబోతున్నారు. నిన్న(ఆదివారం) చెన్నైలో నిశ్చితార్థం కూడా జరిగింది.

విక్రమ్ కుమార్ ఎంగేజ్మెంట్ పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా జరిగింది. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదు. కేవలం ఇరుకుటుంబాల పెద్దలు, బంధువులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

Vikram Kumar Gets Engaged To Srinidhi Venkatesh, Marriage In September

విక్రమ్ కుమార్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం...'విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 24 సినిమా సమయంలో ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారట. సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారం కూడా ఉండటంతో ఇద్దరికీ ఆదివారం ఎంగేజ్మెంట్ జరిగింది. సెప్టెంబర్ నెలలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయిచుకున్నారు' అని తెలుస్తోంది.

శ్రీనిధి కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే కావడంతో ఇద్దరూ త్వరగా కనెక్ట్ అయ్యారు. శ్రీనిధి సౌండ్ డిజైనర్ గా ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ తో కలిసి 24 సినిమాకు పని చేసారు. విక్రమ్ కుమార్ త్వరలో బన్నీ, మహేస్ బాబులతో సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు మొదలు కావడానికి ఇంకా సమయం ఉండటంతో ఈ లోగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

English summary
Director Vikram Kumar, best known for helming Ishq, Manam and his recent release 24, got engaged to 27-year old sound designer Srinidhi Venkatesh on Sunday at a private ceremony in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu