twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ 300 కోట్ల చిత్రం: ‘గంట’కు దర్శకుడి పూజలు, ఆసక్తికర విషయాలు వెలుగులోకి...

    |

    బాహుబలి, 2.0 తర్వాత సౌత్‌ సినీ ఇండస్ట్రీలో భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకుంటోంది. ఇప్పటికే రాజమౌళి రామ్ చరణ్-ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూ. 300 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ మొదలు పెట్టగా... త్వరలో సౌత్ స్టార్ విక్రమ్ హీరోగా 'మహావీర్ కర్ణ' అనే మరో భారీ చిత్రం ప్రారంభం కాబోతోంది. దర్శకుడు ఆర్‌ఎస్ విమల్ రూ. 300 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించబోతున్నారు.

    <strong>విజయ్, విక్రమ్, శింబు ప్రధాన పాత్రల్లో.. మణిరత్నం భారీ మల్టీస్టారర్!</strong>విజయ్, విక్రమ్, శింబు ప్రధాన పాత్రల్లో.. మణిరత్నం భారీ మల్టీస్టారర్!

    తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రారంభించబోతున్న నేపథ్యంలో దర్శకుడు ఆర్ఎస్ విమల్ సోమవారం తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సురేష్ గోపి, ఇంద్రన్స్, బి ఉన్నికృష్ణన్‌తో పాటు పలువురు మాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ పూజ ప్రత్యేకంగా టెంపుల్ బెల్ మీదనే జరుగడం గమనార్హం, ఈ సినిమాలో ఈ బెల్ కీలకంగా ఉంటుందట.

    రాజమోజీ ఫిల్మ్ సిటీకి ఆ గంట తీసుకొచ్చి

    రాజమోజీ ఫిల్మ్ సిటీకి ఆ గంట తీసుకొచ్చి

    పూజ అనంతరం ఆ బెల్‌ను హైదరాబాద్‌లో జరిగే షూటింగుకు తీసుకెళ్లబోతున్నారు. ఇక్కడి రామోజీ ఫిల్మ్ సిటీలో 30 అడుగుల ఎత్తైన రథం నిర్మిస్తున్నారు. ఈ రథంలో అలంకరణగా ఈ బెల్‌ను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

    బాహుబలి కంటే ఎక్కువ బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్స్

    బాహుబలి కంటే ఎక్కువ బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్స్

    ఈ మైథలాజికల్ సినిమాకు రూ. 300 కోట్ల బడ్జెట్ అంచనా వేస్తున్నారు. బాహుబలి-ది కంక్లూజన్ (రూ. 250 కోట్లు) కంటే ఎక్కువ బడ్జెట్‌తో రూపొందుతుండటం చర్చనీయాంశం అయింది. ఈ సినిమా కోసం నిర్మాతలు హాలీవుడ్లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స'కు పని చేసిన టెక్నీషియన్లను హైర్ చేసుకున్నారు.

    విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా

    విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా

    మహావీర్ కర్ణ అద్భుతమైన విజువల్ ఎఫెక్టులతో రూపొందబోతోందని, ఇందుకోసం ఇటు ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ వైడ్ ఫేమస్ అయిన పలు స్టూడియోలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

     ఆ విషయాలన్నీ గోప్యంగానే

    ఆ విషయాలన్నీ గోప్యంగానే

    ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న విక్రమ్ జనవరి, 2019లో సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. 2020 ప్రథమార్థం నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు? అనే విషయాలను ప్రస్తుతానికి అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

     హిందీలో షూట్ చేసి ఇతర భాషల్లోకి అనువాదం

    హిందీలో షూట్ చేసి ఇతర భాషల్లోకి అనువాదం

    ఒరిజినల్‌గా హిందీలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని యూనైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ సంస్థ నిర్మిస్తోంది. మహాభారతం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

    English summary
    Director RS Vimal's upcoming film Mahaveer karna estimated budget is Rs 300 crore, which will make it more expensive than Baahubali: The Conclusion. The producers have already hired technicians of Game Of Thrones fame to work on the project. Vikram, who is playing the titular role, will join the sets in January next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X