»   » విక్ర‌మ్‌, స‌మంత 10 ఫ‌స్ట్‌లుక్ రిలీజ్

విక్ర‌మ్‌, స‌మంత 10 ఫ‌స్ట్‌లుక్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
విక్ర‌మ్‌, స‌మంత 10 చిత్రం ఫ‌స్ట్‌లుక్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సెన్సేష‌న‌ల్ స్టార్ చియాన్ విక్ర‌మ్ హీరోగా బ్యూటీఫుల్ స‌మంత హీరోయిన్‌గా రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 10 ఎన్న‌త్తు కుల్ల‌. విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌కుడు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ నిర్మించిన ఈ చిత్రం త‌మిళంలో మంచి విజయం సాధించింది.

ఈ చిత్రాన్ని తెలుగులో '10' పేరుతో విడుదల చేస్తున్నారు. ఫాక్స్‌స్టార్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌మ‌ణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింత‌ప‌ల్లి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.

Vikram, Samantha '10' Movie First Look Released

ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ తో సినిమా ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

చియాన్ విక్ర‌మ్‌, స‌మంత‌, ఛార్మి, ప‌శుప‌తి, రాహుల్ దేవ్‌, అభిమ‌న్యు సింగ్‌, సునీల్ తాపా త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః డి.ఇమాన్‌, సినిమాటోగ్రాఫ‌ర్ః భాస్క‌రన్ కె.ఎం, నిర్మాత‌లుః జి.సుబ్ర‌మ‌ణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింత‌ప‌ల్లి, ద‌ర్శ‌క‌త్వంః విజ‌య్ మిల్ట‌న్‌.

English summary
Sensation star Chiyaan Vikram and most beautiful Samantha’s super hit Tamil film 10 Endrathukulla is dubbed into Telugu as 10. Directed by Vijay Milton and produced by AR Murugadoss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu