»   » సీరియస్ లుక్స్‌తో మోహన్‌లాల్.. విలన్ ఫస్ట్‌లుక్.. 600 కోట్ల బడ్జెట్‌తో..

సీరియస్ లుక్స్‌తో మోహన్‌లాల్.. విలన్ ఫస్ట్‌లుక్.. 600 కోట్ల బడ్జెట్‌తో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

2016 సంవత్సరం మోహన్‌లాల్ నామ సంవత్సరం. గతేడాది ఆయన నటించిన చిత్రాలు జనతా గ్యారేజ్, కనుపాప (ఓప్పం) మన్యం పులి, (పులిమురగన్ ), మనమంతా చిత్రాలు ఘనవిజయంతో పాటు భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో పులిమురుగన్ చిత్రం దాదాపు 150 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాల విజయం తర్వాత వస్తున్న విలన్ చిత్ర ఫస్ట్‌లుక్ ఆసక్తి రేపుతున్నది.

విలన్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

విలన్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

2017లో మోహన్‌లాల్ నటిస్తున్న చిత్రం విలన్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ మార్చి 7న విడులైంది. రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చాలా రఫ్ లుక్‌తో ఆయన కనిపించిన ఈ చిత్ర పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తున్నది.

విలన్‌లో విలన్లుగా విశాల్, రాక్‌లైన్

విలన్‌లో విలన్లుగా విశాల్, రాక్‌లైన్

బీ ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న విలన్ చిత్రంలో తమిళ నటుడు విశాల్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. అలాగే నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటించడం మరో విశేషం.

చిరకాల కలకు తెరరూపం రాండమూజన్

చిరకాల కలకు తెరరూపం రాండమూజన్

అలాగే విలన్ చిత్రం తర్వాత ఎంటీ వాసుదేవ నాయర్ నవల ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న రాండమూజన్ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్నది ఆయన కల.

600 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్ఠ్మాత్మకంగా

600 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్ఠ్మాత్మకంగా

ఈ చిత్రం మహాభారతంలోని భీముడి పాత్రను పోలి ఉంటుందనే వార్త మీడియా చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రం బడ్జెట్ రూ.600 కోట్లు అని తెలిసింది. విలన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకోగానే రాండమూజన్ చిత్రం సెట్‌లోకి వెళ్లే అవకాశముంది.

English summary
2016 was a year for Mohanlal, who delivered back-to-back blockbusters with Oppam and Pulimurugan, which is touted to be the first Malayalam film to cross the Rs 150-crore club. The makers of megastar Mohanlal have released the first look poster of the upcoming film Villain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu