»   » వినాయక్-అఖిల్ మూవీ ఆడియో రిలీజ్ డేట్!

వినాయక్-అఖిల్ మూవీ ఆడియో రిలీజ్ డేట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తెరంగ్రేటం చేస్తున్న సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 4 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 20న ఎఎన్ఆర్ జయంతి సందర్భంగా ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. దసర కానుకగా అక్టోబర్ 21న సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ నుండి అంతా క్లాస్ హీరోలగానే పేరు తెచ్చుకున్నారు. అయితే అఖిల్ మాత్రం అందుకు భిన్నంగా మాస్ ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తొలి సినిమాతోనే మాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

తొలి సినిమాలో అఖిల్ డాన్స్ మూమెంట్స్, ఫైట్ సీక్వెన్స్ హైలెట్ అయ్యేలా చిత్రీకరణ జరుగుతోంది. దీంతో పాటు సినిమాలో లిప్ లాక్ ముద్దు సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. తొలి సినిమాలోనే అఖిల్ ఈ రేంజిలో రెచ్చిపోవడం చర్చనీయాంశం అయింది.

Vinayak-Akhil movie audio release date

ఈ సినిమా టీజర్ విడుదల చేయటానికి తేదీని ఫిక్స్ చేసారు. అది మరేదో కాదు...అక్కినేని నాగార్జున పుట్టిన రోజు అంటే..ఆగస్టు 29న. ఆ టీజర్ అదిరిపోతుందని చెప్తున్నారు. ఈ మేరకు టీమ్ రాత్రింబవళ్లూ పనిచేస్తోంది. అదే రోజున ఈ చిత్రానికి పెట్టే టైటిల్ కూడా రివిల్ కానుంది.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Vinayak-Akhil movie audio releasing on sep 20.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu