For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వి.వి వినాయక్ తదుపరి చిత్రం ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. నాయక్ తర్వాత చేయబోయే చిత్రం ఖరారైంది. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కుమారుడు సాయి శ్రీనివాస్‌ నటించే తొలి చిత్రాన్ని వినాయక్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో మొదలవుతుంది. ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం.

  రామ్‌ చరణ్‌ హీరోగా యూనివర్సల్‌ మీడియా సంస్థ 'నాయక్‌' చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని జనవరి 12, 2013న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు.

  చిత్రం గురించి వివి వినాయిక్ మాట్లాడుతూ... నిత్యం నెత్తురు మండే యువకులే ఈ దేశానికి అవసరం... అన్నారు శ్రీశ్రీ. ఆ కుర్రాడు కూడా అచ్చం అలాగే ఉంటాడు. సరదాలూ, విలాసాలూ, వినోదాలూ అంటూ కాలాన్ని ఖాళీ చేయడం అతనికి ఇష్టం ఉండదు. లక్ష్యం తప్ప అతని కంటికి మరో వస్తువు కనిపించదు. తన ఒక్కడి కోసం కాదు.. తనని నమ్ముకొన్న అందరి కోసం ఓ పోరాటానికి సిద్ధమయ్యాడు. అదేమిటి? అందులో అతను విజయం సాధించాడా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు .

  అలాగే ''కథకి అనుగుణంగానే నాయక్‌ అనే పేరు ఖరారు చేశాం. రామ్‌ చరణ్‌ పాత్ర తీరుతెన్నులు ఆయన నటించిన గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటాయి.. ఇది యాక్షన్ ఎంటర్టైనర్. ''అన్నారు. నిర్మాత డి.వివి దానయ్య మాట్లాడుతూ... 'ఈ కథకు 'నాయక్' అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. పక్కా మాస్ అంశాలతో పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటే అద్భుతమైన కథను ఆకుల శివ అందించారు. ఈ సినిమాకు సంభాషణలు కూడా శివే అందించడం విశేషం. తమన్ సంగీతం, చోటా కె.నాయుడు ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా అన్నారు.

  'మగధీర' తర్వాత రామ్‌ చరణ్‌, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అమలాపాల్ పాత్ర కూడా కథలో కీలకమైందే. రామ్‌ చరణ్‌ పాత్ర తీరుతెన్నులు ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పటివరకూ కనపించని కొత్త చరణ్ మా సినిమాలో కనిపిస్తాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

  English summary
  VV Vinayak is all set to direct producer Bellamkonda Suresh’s son Sai Srinivas, according to the latest buzz in the industry. This untitled film starring Sai Srinivas is likely to go on floors in February, 2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X