»   » 'విరోధి’ తో సక్సెస్ అయిన శ్రీకాంత్ తమ్ముడు..!?

'విరోధి’ తో సక్సెస్ అయిన శ్రీకాంత్ తమ్ముడు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాంత్ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో మేక మీడియా పతాకంపై శ్రీకాంత్ సోదరుడు అనీల్ నిర్మించిన చిత్రం 'విరోధి'. ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుపొంది విజయాన్ని సొంతం చేసుకొంది. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించిన సందర్బంగా ఈ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ మాట్లాడుతూ తొలిసారిగా మా బ్యానర్ లో విడుదలైన సినిమా ఘన విజయాన్ని సాదించడం చాలా సంతోషంగా వుంది. రైతులు, విధ్యార్దులు, ట్రైబల్స్ ఎందుకని నక్సలిస్ట్ లుగా మారతారు అనే నేపధ్యంలో ఈ చిత్రంలో నేను ఓ పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నటించాను. సినిమాను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. సినిమా కలెక్షన్స్ బాగున్నాయి అన్నారు.

నిర్మాత అనీల్ మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ సినిమా బాగుందని మెచ్చుకొంటూంటే ఒక మంచి సినిమా తీశామనే సంతృప్తి కలిగింది. ఒక సున్నితమైన అంశంతో ఈ సినిమా చాలా చక్కగా రూపుదిద్దుకొంది.ఈ సినిమాకు విజయాన్ని సాధించిపెట్టిన ప్రతిఒక్కరికీ తన కృతజ్ఞతలని తెలిపారు. అలాగే ఈ చిత్ర విజయంతో మరో సరికొత్త సినిమా తీయాలనే సంతోషం కలుగుతోంది అంటూ తన మనోభావాన్ని తెలిపారు.

English summary
Director Neelakanta has taken considerable time to come out with a gripping story after his last film. In Virodhi he brings together the stories of many people with Naxalism as a backdrop.
Please Wait while comments are loading...