»   » గ్యాంగ్ రేప్ : హీరోయిన్ సీరియస్, బూతు కామెంట్స్

గ్యాంగ్ రేప్ : హీరోయిన్ సీరియస్, బూతు కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీ ఫెలో' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన విశాఖ సింగ్..... తాజాగా ఢిల్లీలో జరిగి గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్రంగా స్పందించింది. నిందితులపై, ఈ వ్యవస్థపై బూతు కామెంట్లతో విరుచుకు పడింది. దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు తలుచుకుంటే....విశాఖ సింగ్ కు మాత్రమే కాదు, ఎవరికైనా అలానే కోపం వస్తోంది.

రోమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా హాజరైన ఇటీవలే ఇండియా తిరిగి వచ్చిన విశాఖ సింగ్.... దేశ రాజధానిలో చోటు చేసుకున్న భయంకరమైన గ్యాంగ్ రేప్ సంఘటన గురించి తెలిసి మండి పడింది. ఢిల్లీలో మూవింగ్ ఆటోలో మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ దేశం మొత్తాన్నిషాకైంది. ఈ ఘటనపై విశాఖ సింగ్ ట్వీట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.

Vishakha Singh comments on gang rape

మహిళలపై దారుణాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి....ఈ సొసైటీ, ఈ దేశంలోని పరిస్థితులే ఇందుకు కారణం. F**k you rapists! F**k the system అంటూ మండి పడింది. విశాఖ సింగ్ మాత్రమే కాదు, పలువురు మహిళలు ఈ ఘటనపై మండి పడ్డారు.

దేశ రాజధానిలో గత కొన్ని నెలలుగా మహిళలపై దారుణాలు పెరిగి పోతున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోవడానికి వ్యవస్థలోని లోపాలే కారణమని పలువురి వాదన. ముఖ్యంగా నిందితులకు సరైన శిక్ష పడటం లేదు. ఒక వేళ శిక్ష పడినా చాలా లేటవుతుంది. పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందనేది పలువురి వాదన.

English summary
'F**k you rapists! F**k the system ,the society ,the whole bloody nation for letting women down! Again&again&again!!!' Vishakha Singh responds on gang rape.
Please Wait while comments are loading...