»   »  హీరోయిన్‌పై ఫేస్‌బుక్‌లో బూతు కామెంట్స్, ఎదురు దాడి

హీరోయిన్‌పై ఫేస్‌బుక్‌లో బూతు కామెంట్స్, ఎదురు దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో రౌడీ ఫెలో తో పాటు పలు హిందీ, తమిళం చిత్రాల్లో నటించిన హీరోయిన్ విశాఖ సింగ్ ఫేస్‌బుక్‌లో కొందరి నుండి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఆమె పోస్టు చేసిన ఫోటోపై కొందరు వ్యక్తులు వల్గర్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అయితే ఆమె ఏమాత్రం అధైర్య పడకుండా వారిపై ఎదురు దాడి చేసింది.

Vishakha Singh Gets Vulgar Comments On FB; Slams The Abusers

"'Everybody is somebody's foreigner' అనే క్యాప్సన్ ఉన్న ఫోటోను విశాఖ సింగ్ ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అయితే కొందరు ఆకతాయిలు ఆమె ఫోటోపై బూతు కామెంట్లు, వల్గర్ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఆమె వక్షోజాల గురించి అసభ్యంగా కామెంట్లు చేసారు.

సదరు వల్గర్ కామెంట్లపై విశాఖ సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. నీ తల్లికి, చెల్లికి, భార్యకి, బామ్మకి, స్నేహితులకూ కూడా వక్షోజాలు ఉంటాయి. నీలాంటి మూర్ఖులకు మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు. నా పేజీ నుండి గెట్ ఔట్ అంటూ కోపంగా రిప్లై ఇచ్చింది విశాఖ సింగ్.

Vishakha Singh Gets Vulgar Comments On FB; Slams The Abusers

ఈ కామెంట్లకు సంబంధించిన వివాదం తీవ్రం కావడంతో.... తన పోస్టింగును ఫేస్ బుక్ నుండి తొలగించింది. వివాదానికి తెరదించడానికే తాను ఆ పోస్టును తొలగించినట్లు విశాఖ సింగ్ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ మీద పేర్కొన్నారు.

English summary
Fukrey actress, Vishakha Singh has been in news after she received some vulgar comments on Facebook, followed by she slamming the abusers. The actress posted a picture on Facebook, wearing a t-shirt and captioned the same saying, "'Everybody is somebody's foreigner'. Wearing Madversity's cool new Tee ..looking forward to more such quotes (sic)".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu