»   » నిజమే.. హీరోయిన్ తో ప్రేమాయణం నడిపా: విశాల్‌

నిజమే.. హీరోయిన్ తో ప్రేమాయణం నడిపా: విశాల్‌

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాను. ఆమెతో ప్రేమలో పడినమాట వాస్తవమే. మధ్యలో పెటాకులైనదీ నిజమే. అందుకే ఆ సంగతిపై మాట్లాడదల్చుకోలేదు. ఆ విషయం గురించి ఏదైనా మాట్లాడితే ప్రచారం పెంచుకునేందుకని విమర్శిస్తారు. అందుకే సైలెంట్ గా ఉన్నాను అన్నారు విశాల్. అప్పట్లో రీమాసేన్ తో లవ్ ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఆయన తాజా చిత్రం 'సమర్‌' విడదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  అలాగే వరలక్ష్మితో లవ్ ఎఫైర్ నడుపుతున్నాడంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ... వరూ(వరలక్ష్మి) నాకు చిన్నప్పటి నుంచే స్నేహితురాలు. ఇప్పటికీ చాలా సన్నిహితురాలు. మా మధ్య ఉన్నది 20 ఏళ్ల స్నేహానికి మించి మరేం లేదు అని తేల్చి చెప్పారు. వరలక్ష్మి.. శరత్ కుమార్ కూతురు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్యన ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.

  తమిళతెరపై విశేషంగా రాణిస్తున్న తెలుగుతేజం విశాల్‌. పందెం కోడి, పొగరు, భరణితో వరుస మాస్‌ విజయాలు అందుకుని యాక్షన్‌ కథానాయకుడిగా ప్రత్యేక ఇమేజ్‌ సృష్టించుకున్నాడు. మాస్‌ పాత్రలకు తప్ప మిగతావాటికి పనికిరాడన్న విమర్శకులకు సరైన సమాధానం చెబుతూ 'వాడు-వీడు‌'లో మెల్లకన్నుతో, 'కిలాడి'లో రొమాంటిక్‌ హీరోగా సత్తా చాటాడు. ప్రస్తుతం ఆయన నటించిన సమర్‌, మదగజరాజా (ఎమ్‌జీఆర్‌)లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

  'సమర్‌'గురించి మాట్లాడుతూ.. అప్పటి సినిమాల్లో ఏదైనా రెండు మూడు సన్నివేశాలకే ట్విస్ట్ లు పరిమితం. ఇప్పుడు అలాంటివి మొదటి నుంచి చివరిదాకా లేకుంటే జనం ఆదరించడంలేదు. 'వాడు‌-వీడు' తర్వాత వైవిధ్యంగా కనిపించాలని ఆశపడ్డాను. అప్పుడే తిరు వినిపించిన 'సమర్‌' కథ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథాపరంగా వూటీలో ప్రారంభమై 15 నిమిషాల్లోనే బ్యాంకాక్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి నడిచే సన్నివేశాలు ప్రేక్షకులకు మరిన్ని మలుపుల్ని అందిస్తాయి అన్నారు.

  సమర్ లో తనతో నటించిన త్రిష గురించి చెపుతూ... వాస్తవానికి 'భరణి'లోనే మేమిద్దరం కలసి నటించాల్సింది. ఆపై కూడా పలు సినిమాలకు ఆమె పేరును పరిశీలించినా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు 'సమర్‌'లో ఆడిపాడాం. ఇందులో మా ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిందనే చెప్పాలి. ఇద్దరినీ మంచి మిత్రులను చేసిన చిత్రం కూడా ఇదే అన్నారు. అలాగే ప్రేమలో ఇక్కట్లు ఎదుర్కొంటున్న త్రిష, నయనతారలకు ఎలాంటి సలహా ఇవ్వను. వ్యక్తిగతంగా చాలా విషయాలే మాట్లాడుకుంటాము. అందుకుని వాటిని బయటకు చెప్పమంటారా? అని అన్నారు.

  English summary
  It is not new for Vishal to be rumoured with actresses working with him. But this time, he has been linked with an actress with whom he hasn’t worked so far and the grapevine is spreading like a wildfire in the industry. It is said that Vishal & Varalaxmi (daughter of ace actor Sarath Kumar, who is making her acting debut with Simbu-starrer ‘Poda Podi‘) are seeing each for some time now and they are serious about their relationship.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more