»   » తెలుగు సినిమా చేయకపోతే నువ్వు ఈడియట్ వే: అని వాళ్ళమ్మ తిట్టిందట

తెలుగు సినిమా చేయకపోతే నువ్వు ఈడియట్ వే: అని వాళ్ళమ్మ తిట్టిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు వాళ్ళే అయినా ఫ్యామిలీ అంతా తమిళనాడులో స్థిరపడ్డం వల్ల. అక్కడే పెరిగిన విశాల్ తమిళంలోనే హీరో గా మారాడు. విశాల్ సినిమాలు తెలుగు లోకి డబ్ అయి మంచి విజయాలే సాధించినా.. ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయక పోవటం భాదగానే ఉందట. ఈ మధ్యనే విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా రాయుడూ సక్సెస్ మీట్ లో హీరో విశాల్ ఈ విశయమే చెప్పుకొచ్చాడు.

"రాయుడు" మొదటి ఆటను ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూశా. వాళ్ల స్పందన చూసి, "పందెంకోడి" చిత్రం నాటి అనుభూతి కలిగింది. విశాల్ మంచి పాత్ర ఎంచుకుని న్యాయం చేశాడని అంటున్నారు. తెలుగులో ఇంత మంచి రెస్పాన్స్ రావడంతో మా అమ్మ కూడా "ఇప్పుడైనా నువ్వు తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయకపోతే నీ అంత ఇడియట్ ఉండడు" అని కోపంగా తిట్టింది. తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేయబోతున్నా. "పందెంకోడి"కి సీక్వెల్ చేయాలనే ప్లాన్ ఉంది." అని చెప్పాడు.

vishal

విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో తమిళంలో తెరకెక్కిన "మరుదు" చిత్రాన్ని జి.హరి 'రాయుడు' పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికీ రెండువందల థియేటర్లలో విజయవంతంగా రాయుడు ప్రదర్శితమవుతోంది.

ఇప్పటికే స్ట్రైట్ తెలుగు సినిమా కోసం రంగం సిద్దమైందత. తెలుగు హీరోగా సురాజ్ డైరెక్షన్‌లో మరో ప్రయత్నం చేయనున్నాడు విశాల్. ఈ సినిమాను కూడా రాయుడు సినిమాను డబ్బింగ్ చేేసి తెలుగు రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ హరి నే నిర్మించనున్నారు.

అంతే కాదు ఈ సినిమాకు తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ అవ్వాలని కూడా విశాల్ కోరుకుంటున్నాడు. అందుకే విలన్‌గా ఒకప్పటి తెలుగు హీరో, ఇప్పుడు నంబర్ వన్ విలన్ జగపతి బాబును ఫైనల్ చేశాడు. అలాగే తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న తమన్నాను హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 9న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందిట.

English summary
After a long time Young Hero Vishal is directly greet his Telugu fans with a straight Telugu movie. Vishal’s next movie "Thupparivaalan" is also simultaneously made in Telugu version and it is released in Telugu film industry as like as in Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu