»   » మోహ‌న్‌లాల్ మూవీ: శ్రీకాంత్‌, విశాల్‌, హ‌న్సిక, రాశి ఖ‌న్నాల మాలీవుడ్ ఎంట్రీ!

మోహ‌న్‌లాల్ మూవీ: శ్రీకాంత్‌, విశాల్‌, హ‌న్సిక, రాశి ఖ‌న్నాల మాలీవుడ్ ఎంట్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ 'విలన్' సినిమా ద్వారా తమిళం, తెలుగు స్టార్ యాక్టర్స్ మాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. తెలుగు న‌టుడు శ్రీకాంత్‌, త‌మిళ న‌టుడు విశాల్‌, న‌టీమ‌ణులు హ‌న్సిక, రాశి ఖ‌న్నాలు మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్ట‌బోతున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది.

ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ద‌ర్శ‌కుడు బి. ఉన్నికృష్ణ‌న్ ఒక ఫేస్‌బుక్‌ పోస్టు పెట్టారు. ఇందులో ఎవరెవరు? ఏయే పాత్రలు చేస్తున్నారనే విషయాలు వెల్లడించారు. మళయాలంలో ఒకేసారి ఇంత మంది ఇతర పరిశ్రమలకు చెందిన కొత్త స్టార్స్ పరిచయం కావడం ఇదే తొలిసారి. వీరంద‌రూ క‌లిసి మోహ‌న్ లాల్ పోషించే మాథ్యూ మంజూర‌న్ అనే పాత్ర‌ను ఎదుర్కుంటారని ఉన్నికృష్ణ‌న్ పేర్కొన్నారు.

విశాల్

విశాల్

శ‌క్తివేల్ ప‌ళ‌నిస్వామి అనే పాత్ర‌ను విశాల్‌ పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ దర్శకుడు బి.ఉన్నికృష్ణన్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. విశాల్ ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుని పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

శ్రీకాంత్

శ్రీకాంత్

ఫెలిక్స్ డి విన్సెంట్ అనే పాత్ర‌ను శ్రీకాంత్ పోషిస్తున్నారు. సినిమాలో శ్రీకాంత్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది.

హన్సిక

హన్సిక

శ్రేయ అనే పాత్ర‌ను హ‌న్సిక పోషిస్తోంది. ఇన్నేళ్ల సినీ కెరీర్లో హన్సిక మళయాలంలో నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్‌గా కనిపించబోతోందని సమాచారం. హ‌న్సికది గాయ‌ని పాత్ర.

రాశి ఖన్నా

రాశి ఖన్నా

హ‌ర్షిత చోప్రా అనే పాత్ర‌ను రాశి ఖ‌న్నా పోషిస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు తెలిపారు. సినిమాలో రాశి ఖన్నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. రాశి ఖ‌న్నాది అవినీతి పోలీసాఫీస‌ర్ పాత్ర అని స‌మాచారం.

English summary
Vishal is quite upbeat about his Malayalam film debut and all praise for his director B Unnikrishnan. He will be seen alongside superstar Mohanlal in the film. The film also stars Hansika Motwani, Manju Warrier, Srikanth and Raashi Khanna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu