»   »  ‘టెంపర్’ చూపించబోతున్న విశాల్

‘టెంపర్’ చూపించబోతున్న విశాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్‌ విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన 'టెంపర్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు, బండ్ల గణేష్ లు నిర్మిస్తున్నారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు మాట్లాడుతూ ''తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందిరికీ తెలసిందే. ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో విశాల్ హీరోగా రీమేక్ చేయనున్నాం అన్నారు.

Vishal in Temper Tamil remake

పందెంకోడి, పొగరు వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న విశాల్ తో ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించనుండటం చాలా హ్యపీగా ఉంది. విశాల్ కు కొత్త బాడీ లాంగ్వేజ్ ను ఆపాదించే చిత్రంగా ఈ చిత్రం ఓ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్, దర్శకుడు సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం'' అన్నారు.

'టెంపర్' తమిళ రీమేక్ శింబు చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. చివరకు ఈ ప్రాజెక్ట్ విశాల్ చేతికి వెళ్లింది. ఇప్పటికే విశాల్ తమిళంలో పలు పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లు చేసారు. ఈ సినిమా అతనికి పర్ ఫెక్టుగా సూటవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

English summary
Tamil actor Vishal will be seen in the Tamil remake of NTR's blockbuster film, Temper. Earlier Simbu was to do this film. But Vishal was hell bent on doing it and the Producer also chose Vishal for the remake project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu