‘దేనికైనా రెడీ’ ఆడియో, చిత్రం విడుదల వివరాలు
హైదరాబాద్: మంచు విష్ణు, జి.నాగేశ్వరరెడ్డి కంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 23న విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే చిత్రాన్ని అక్టోబర్ రెండవ వారంలో విడుదల చేయాటనికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికి మూడు పాటలు షూట్ పూర్తైంది.
అలాగే ఆగస్టు 24 నుంచి, సెప్టెంబర్ 6 వరకూ హన్సిక, విష్ణుల మీద ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో యూరప్, ధాయ్ ల్యాండ్ లో పాటలు షూట్ చేయనున్నారు. ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను మలుస్తున్నారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది. విష్ణుఈ చిత్రం గురించి చెబుతూ ''రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించేలా ఉంటుందీ చిత్రం. ప్రతి పాత్ర కావల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఈ వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. నా కెరీర్‌లో ప్రత్యేకస్థానంలో నిలిచే సినిమా ఇది'' అన్నారు. 'ఢీ' తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన కెరీర్‌లో నిలుస్తుందని విష్ణు తెలిపారు.
ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ... ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి... వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.
ఈ చిత్రానికి కథ-బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్ బాబు.


Click it and Unblock the Notifications











