twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు.. ఇండస్ట్రీలో కలకలం

    |

    రెండు రోజుల క్రితం 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు రామ్ చరణ్‌ను ఉద్దేశించి కీలక సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

    ఉత్తమ నటుడు దక్కలేదు

    ఉత్తమ నటుడు దక్కలేదు

    66వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడి విభాగంలో ఆయుష్మాన్‌ ఖురానా, విక్కీ కౌశల్‌ సంయుక్తంగా ఇచ్చారు. దీంతో మెగా అభిమానులతో పాటు టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది నిరాశకు గురయ్యారు. కారణం.. ‘రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ నటనకు అవార్డు దక్కుతుందని చాలా మంది అనుకున్నారు. ఆ మధ్య దీనికి సంబంధించిన కొన్ని వార్తలు కూడా వచ్చాయి.

    రంగస్థలంకు ఒక అవార్డు

    సుకుమార్, రామ్ చరణ్ కాంబీనేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘రంగస్థలం' సినిమాకు బెస్ట్ ఆడియో మిక్సింగ్ కేటగిరిలో రాజా కృష్ణన్ అవార్డ్ వరించిది. దీనితో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘చి.ల.సౌ' మూవీ నేషనల్ బెస్ట్ ఓరిజినల్ స్క్రీన్ ప్లే గా అవార్డ్ అందుకుంది. ‘ఆ!' సినిమాకు రెండు కేటగిరిల్లో అవార్డులు వరించాయి. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ గా, బెస్ట్ మేకప్ విభాగంలో ‘ఆ!' సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

    చరణ్‌కు మద్దతుగా విష్ణు ట్వీట్

    చరణ్‌కు మద్దతుగా విష్ణు ట్వీట్

    రామ్ చరణ్‌కు మద్దతుగా విష్ణు ట్వీట్ చేశాడు. ‘జాతీయ అవార్డులు గెలుచున్న వారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. కానీ సోదరుడు రాంచరణ్ రంగస్థలం చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా అన్ని విధాలా అర్హుడు. నా అభిప్రాయాన్ని నిజాయతీగా చెబుతున్నా.. రాంచరణ్ రంగస్థలంలో ఉత్తమ నటన కనబరిచాడు. ఇటీవల కాలంలో అలాంటి నటనని మరే నటుడిలోనూ చూడలేదు. రంగస్థలం చిత్రంపై ప్రేక్షకులు ప్రేమ చూపించి ఆల్రెడీ రాంచరణ్ కు అవార్డు ఇచ్చేశారు' అని అందులో పేర్కొన్నాడు.

    రంగస్థలం గురించి

    రంగస్థలం గురించి

    క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా ‘రంగస్థలం'. ఈ సినిమాలో చిట్టి బాబు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు రామ్‌చరణ్‌. ఈ నటన చూసి మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రజలంతా మైమరచిపోయారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, అనసూయ, జబర్ధస్త్ మహేశ్ కీలక పాత్రలు చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

    English summary
    No offense to the other winners, but in my honest opinion my bruh Ram Charan deserved to win the National award for best actor in Rangasthalam. By far it was one of the best performances by any actor in the recent times. Anyways the audience love is the biggest award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X