For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA President: మాట నిలుపుకున్న మంచు విష్ణు.. చార్జ్ తీసుకున్న వెంటనే ఆ ఫైల్‌పై సంతకం

  |

  ప్రతి రెండేళ్లకు ఒకసారి తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'కు ఎన్నికలు జరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రతిసారీ దీని గురించి పరిశ్రమలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అయితే, ఈ సారి అది ఇంకాస్త ముందుగానే ప్రారంభం అయింది. అందుకు అనుగుణంగానే ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎన్నో మలుపులు, ఎన్నో గొడవలు, ఎన్నో ఊహించని పరిణామాల మధ్య గత ఆదివారం జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో అతడు తాజాగా మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. అలాగే, ఓ ఫైల్‌పై సంతకం చేసి మాట నిలుపుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

   ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణు.. నువ్వా నేనా

  ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణు.. నువ్వా నేనా

  ఈ సారి ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌'కు జరిగిన ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ప్రకాశ్ రాజ్ వర్గం ఒకవైపు, మంచు విష్ణు ప్యానెల్ మరోవైపు ఇందులో పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులంతా రాజకీయ నేతల్లా పావులు కదుపుతూ.. విమర్శలు చేసుకోవడం సహా ఎన్నో విధాలుగా ఎన్నికలను రక్తి కట్టించారు. దీంతో నువ్వా నేనా అన్నట్లు ఇద్దరి మధ్య పోటీ జరిగింది.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

  మంచు విష్ణును వరించిన మా విజయం

  మంచు విష్ణును వరించిన మా విజయం

  ఎన్నో ట్విస్టులతో సాగిన ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌' ఎన్నికలో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే, అతడి ప్యానెల్‌లోని పలువురు సభ్యులు కూడా గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి కూడా పలువురు సభ్యులు ఈసీ మెంబర్లుగా గెలిచారు. దీంతో మంచు విష్ణు వర్గం ఫుల్ ఖుషీగా ఉండిపోయింది.

   ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా

  ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా

  ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌' ఎన్నికల సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వేడి వాతావరణం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రకాశ్ రాజ్‌తో పాటు నాగబాబు ఇప్పటికే మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే, మంగళవారం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యులు అందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి షాకిచ్చారు.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

   మా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

  మా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

  మూడు రోజుల క్రితం జరిగిన ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌' ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు.. తాజాగా తన బాధ్యతలను స్వీకరించాడు. మా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నారు. ఈ సందర్భంగా అతడిని పలువురు ప్రముఖులు సన్మానించారు. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఆశీర్వాదం కోరాడు.

  తొలి సంతకం ఆ ఫైల్ మీదే పెట్టేశాడుగా

  తొలి సంతకం ఆ ఫైల్ మీదే పెట్టేశాడుగా

  ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌' ఎన్నికలకు ముందు మంచు విష్ణు మ్యానిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఆర్టిస్టుల పెన్షన్స్, మా భవనం, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల బాగోగులకు సంబంధించిన విషయాలను పొందుపరిచాడు. ఇక, తాజాగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల ఫైలుపై తన తొలి సంతకాన్ని చేశాడు మంచు విష్ణు.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
   వాళ్లందరితోనే ప్రమాణ స్వీకారం చేస్తారా?

  వాళ్లందరితోనే ప్రమాణ స్వీకారం చేస్తారా?

  ప్రస్తుతానికి మంచు విష్ణు ఒక్కడే ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. అతడితో పాటు గెలిచిన వాళ్లంతా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లు రాజీనాయా చేయడంతో.. మరి ప్రమాణ స్వీకారం ఎలా జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. వాళ్లను బుజ్జగిస్తారా? లేక కొత్త వాళ్లతో భర్తీ చేస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

  English summary
  Tollywood Actor and Producer Vishnu Manchu Won MAA Elections 2021 Recently. Now He Took The Charge as MAA President.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X