»   » నచ్చకున్నా కొడుక్కి ఫ్రెండ్ పేరు పెట్టాడట... ఇద్దరు యంగ్‌హీరోల ఫ్రెండ్షిప్ కథ

నచ్చకున్నా కొడుక్కి ఫ్రెండ్ పేరు పెట్టాడట... ఇద్దరు యంగ్‌హీరోల ఫ్రెండ్షిప్ కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులేస్తోన్న కోలీవుడ్‌ యంగ్‌హీరో విష్ణు విశాల్‌ రెండు నెలల క్రితం తండ్రి అయిన విషయం తెలిసిందే.కాగా, విష్ణు, రజని దంపతులకు గత జనవరి 30వ తేదీన మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు తనకొడుక్కి పేరు పెట్టి మళ్ళీ వార్తల్లో కనిపించాడు. కొడుక్కి పేరుపెడితే వార్తల్లోకి ఎలా వచ్చాడు అనుకుంటున్నారా అదే మది ఇక్కడ ఆ ఆ కొడుకు పేరు వెనుక ఒక కథ ఉంది.

Vishnu Vishal's Son Gets Popular Tamil Actor's Name

వారసుడు పుట్టాక మరింత జోష్‌తో కనిపిస్తున్న విష్ణు గత శనివారం ట్విట్టర్‌లో అభిమానులకు షాకిచ్చే వార్త ఒకటి పోస్టు చేశాడు. 'నా రాక్‌స్టార్‌ను మీకు పరిచయం చేస్తున్నాను. నా వారసుడికి ఆర్యన్ అని పేరు పెట్టాను' అని రాస్తూ... నటుడు ఆర్యకి టాగ్‌ చేశాడు. అందులో 'నీకు సంతోషమేనా? నీ కోరికని నేను నెరవేర్చాను. నా కొడుక్కి నీ పేరు పెట్టమన్నావుగా' అని పేర్కొనడం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఇప్పుడు అర్థమయ్యింది కదా విష్ణు, ఆర్య ఎప్పట్నుంచో మంచి స్నేహితులన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే గతం లో ఈ ఇద్దరి మధ్యా పేర్ల విషయం లో చిన్న వాదం జరిగిందట. ఆర్య అనే పేరు నార్తిండియన్ పేరు అని విష్ణు అంటే సరే ఏదైనా కావచ్చు నేను నీ మిత్రున్ని కదా నా స్నేహానికి పేరు ముఖ్యమా అని అని ఆర్య అంటే...

Vishnu Vishal's Son Gets Popular Tamil Actor's Name

నువ్వంటే నాకు చాలా ఇష్టం అని విష్ణు అన్నాడట. అయితే నీకు నాపేరు నచ్చదన్నావ్ కదా. .. నీకుపుట్టబోయేది మగ బిడ్డ అయితే.. ఈ పేరే పట్టి చూపించు అన్నాడట ఆర్య. అప్పటికి సైలెంట్ అయిపోయిన విష్ణు ఇలా తన కొడుక్కి స్నేహితుడిపేరు పెట్టేసాడు. అయితే తన వారసుడికి స్నేహితుడి పేరు పెట్టేంత స్థాయిలో వీరిమధ్య స్నేహం ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం విష్ణు 'కథానాయగన్', 'సిండ్రెల్లా' చిత్రాల్లో నటిస్తూ, మరో చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నాడు.

English summary
"Introducing u all to my ROCKSTAR...v hav named him ARYAN :) arya_offl r u happy? i fullfilled ur wish ..u askd me to name him aftr u" Tweets Vishnu Vishal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu