»   » కళాతపస్వి కామెంట్: చిరు ‘మోగాస్టార్’ హోదా కోల్పోయారు

కళాతపస్వి కామెంట్: చిరు ‘మోగాస్టార్’ హోదా కోల్పోయారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి సినిమాల్లో ఉన్నంత కాలం మెగాస్టార్ గా ఓ వెలుగు వెలిగారు. సినిమాలకు టాటా చెప్పి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలవుతోంది. ఆయన హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్' చిత్రం 2007లో విడుదలైంది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెల్లారు. కేంద్రమంత్రిగా పని చేసారు.

రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా ఆయన కొంత అపవాదులు మూటగట్టుకున్నారనేది కాదనలేని వాస్తవం. ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన నిలబడే పరిస్థితులు లేక పోవడంతో మళ్లీ సినిమా రంగం వైపు చూస్తున్నారు. 150వ సినిమా ద్వారా మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Vishwanath's sensational comments on Mega Star Chiranjeevi!

ఒకప్పుడు తెలుగు తెరపై హీరోగా వెలుగొందినపుడు ఆయన్ను మెగాస్టార్ గా పిలవడం సబబే కానీ... సినిమాలకు దూరమై రీ ఎంట్రీ ఇస్తున్న ఆయన్ను ఇంకా ‘మెగాస్టార్'గా పరిగణించడం సబబు కాదనే కొందరి వాదన. ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసారుప్రముఖ దర్శకడు, చిరంజీవితో స్వయంకృషి, ఆపద్భాందవుడు లాంటి హిట్ చిత్రాలను తీసిన కె. విశ్వానాథ్.

ఇటీవలో ఓ సందర్భంలో కె. విశ్వనాథ్ మాట్లాడుతూ... చిరంజీవి ఇక మెగాస్టార్ కాదు. పాలిటిక్స్‌లోకి ఎంటరవ్వడం ద్వారా ఆయన తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లో చాలావరకు కోల్పోయారు. మాస్ సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా ఆయన మళ్ళీ మునుపటి క్రేజ్ తెచ్చుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇకపై నటించబోయే సినిమాను తన మొదటి సినిమాలా భావించి మళ్లీ మెగాస్టార్ రేంజ్‌కు ఎదగాలని చిరంజీవికి సలహా ఇచ్చారు కళాతపస్వి. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని స్పష్టం చేసారు విశ్వనాథ్.

English summary
'He is not Megastar now' Director K.Vishwanath Shocking Comments on Chiranjeevi.
Please Wait while comments are loading...