»   » రామ్,వెంకీలతో 'వైవా' హర్ష ఎన్‌కౌంటర్

రామ్,వెంకీలతో 'వైవా' హర్ష ఎన్‌కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్ . ఈ సినిమాకి 'మసాలా' టైటిల్‌ ప్రచారంలో ఉంది. విజయ్‌భాస్కర్‌ దర్శకుడు. స్రవంతి మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. హిందీలో వచ్చిన 'బోల్‌బచ్చన్‌'కి ఇది రీమేక్‌. ఈ సినిమా ప్రచారాన్ని వైవిధ్యంగా చేపట్టేందుకు దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

  'వైవా' అనే షార్ట్ ఫిలిం ద్వారా అందరికీ పరిచయమైన హర్ష చెముడుతో ఓ వీడియోని రూపొందిస్తున్నారు. ఆ లఘు చిత్రం తరహాలోనే హర్ష.. వెంకటేష్‌, రామ్‌ని ప్రశ్నలు అడుగుతాడు. దానికి వారు చెప్పిన జవాబులతో వీడియోను రూపొందించారు. దీన్ని యూట్యూబ్‌లో త్వరలో విడుదల చేయనున్నారని చిత్ర వర్గాల సమాచారం.


  ఈచిత్రం ఆడియో ఆగస్టు 23న అని నిర్ణయించారు. అయితే అనుకోకుండా ఏర్పడ్డ సమస్యల వల్ల ఆడియో విడుదల తేదీ వాయిదా పడిందని, త్వరలో ఆడియో డేట్ ప్రకటిస్తామని ఈ చిత్ర హీరో రామ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  రామ్ సినిమాలపై తన మనోగతం గురించి వెల్లడిస్తూ 'నేను దర్శకుణ్ణి నమ్మి సినిమాలు చేస్తాను. ఫలానా కథ కావాలని ఏ దర్శకుణ్ణి కోరను. ఎందుకంటే నటుడిగా నేను ఒక్క కోణంలోనే ఆలోచిస్తాను. దర్శకులు వారి సృజనకు అనుగుణంగా నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాలని ఆలోచిస్తారు. కథ నచ్చితే దానికి వందశాతం న్యాయం చేయడంపైనే నేను దృష్టిపెడతాను' అని చెపుతున్నారు రామ్.

  సోలోగా సినిమాలు చేయడం వల్ల అంతగా కలిసి రాక పోవడంతో మల్టీ స్టారర్ సినిమాలపై దృష్టి సారించిన వెంకటేష్....అలాంటి స్క్రిప్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందీలో రూపొందిన 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. 'మసాలా' చిత్రంలో అజయ్ దేవగన్ పాత్రలో వెంకీ కనిపించనున్నారు.

  English summary
  Viva is a short film which went viral on the internet and also helped its lead actor Harsha to become famous. You could find a lot of videos on Youtube where Harsha making a mockery at the Telugu actors. Makers of Venkatesh and Ram’s upcoming film Masala has decided to follow the Viva format to promote their film. A video featuring Venky, Ram and Harsha will be released soon on the Youtube. Just like in Viva, Harsha would question the family hero and energetic hero about the experiences they had while shooting for the multi-starrer. This move is paving way for a new kind promotion and it is cost-effective too.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more