»   » హాలీవుడ్ మూవీలా ఉంది గురూ.... అజిత్ ‘వివేగమ్’ ట్రైలర్ సూపర్!

హాలీవుడ్ మూవీలా ఉంది గురూ.... అజిత్ ‘వివేగమ్’ ట్రైలర్ సూపర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న 'వివేగమ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాటగా అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది.

శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇందులో అజిత్ ఇంటర్‌పోల్‌ అధికారిగా నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో వాడిన టెక్నాలజీ హాలీవుడ్ రేంజిలో ఉందని స్పష్టమవుతోంది.

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

అజిత్- శివ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన వేదాలం, వీరమ్ చిత్రాలు తమిళనాడులో భారీగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 'వివేగమ్' పై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.

English summary
The Official Teaser of "Vivegam" released. Starring Ajith Kumar, Vivek Oberoi, Kajal Aggarwal, Akshara Hassan ; Written & Directed by Siva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu