»   » అజిత్ కొత్త సెంటిమెంట్: నమ్మటం కష్టమే అయినా నిజం

అజిత్ కొత్త సెంటిమెంట్: నమ్మటం కష్టమే అయినా నిజం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఫీల్డ్ అంటేనే విపరీతమైన నమ్మకాలూ, సెంటిమెంట్లూ ఉండే జోన్ అని ఎప్పటినుంచో ఒక అభిప్రాయం ఉంది. ప్రతీ చిన్న విషయాన్నీ భూతద్దం లో చూస్తారు సినిమా హిట్ కి పనికి వచ్చే ఏ కారణాన్నీ పక్కకు పెట్టక పోవటం కనిపిస్తుంది... వరుసగా ఒక హీరో యింతో ఫ్లాప్ లు వస్తే ఆమెది ఐరన్ లెగ్ అవుతుంది, హిట్ వస్తే ఆమె సెంటిమెంట్.., వరుసగా హిట్ సినిమాల్లో ఏదైనా రిపీట్ అయ్యిందంటే చాలు అది ఇక సెంటిమెంట్ గా స్థిరపడిపోతుంది..,

సెంటిమెంట్

సెంటిమెంట్

టాలీవుడ్ లో రాఘవేంద్ర రావు సినిమా మొదలైన దగ్గరినుంచీ పూర్తయ్యే వరకూ గడ్డం తీయరు, ఇదే పద్దతిని ఆయన శిశ్యుడు రాజమౌళి కూడా ఫాలో అవుతున్నారు, గోపీచంద్ కి రెండక్షరాల టైటిల్ సెంటిమెంట్ లౌక్యం, సౌఖ్య, శౌర్యం ఇలా ఇంకా చెప్పాలంటే ఇలాంటివి చాలానే ఉన్నాయి.

తమిళ ఇండస్ట్రీ లో కూడా

తమిళ ఇండస్ట్రీ లో కూడా

టాలీవుడ్ లోనే కాదు తమిళ ఇండస్ట్రీ లో కూడా ఈ నమ్మకాలకు కొదవేం లేదు ఇంతకీ ఇప్పుడు సెంటిమెంట్ల విషయం ఎందుకొచ్చిందీ అంటే ఇలా నమ్మకాల బ్యాచ్ లో కొత్తగా అజిత్ కూడా చేరాడా అన్న టాక్ వినిపిస్తొంది... స్వతహాగా దైవ భక్తి ఎక్కువే అయినా మామూలు నమ్మకాలకు దూరంగా ఉంటాడు అని అజిత్ గురించి చెప్పుకునే వాళ్ళు అయితే ఈ మధ్య అజిత్ లో కూడా మార్పు వచ్చిందట...

వివేగం

వివేగం

ఈ మధ్య కాలం లో వీరమ్, వేదాళం చిత్రాలు వరుసగా విజయాలు సాధించి అజిత్‌ విజయాల గ్రాస్‌ పెంచాయనే చెప్పాలి. వీరమ్‌ జనవరి 10న విడుదల కాగా, వేదాళం నవంబర్‌ 10న విడుదలైంది. తాజాగా నటిస్తున్న చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో కమలహాసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 10న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.

వరుసగా 10వ తేదీన

వరుసగా 10వ తేదీన

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మూడు చిత్రాల మొదటి అక్షరం ‘వి' తో మొదలవుతోంది. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు శివ కావడం విశేషం. ఇలా అజిత్‌ నటిస్తున్న చిత్రాలు వరుసగా 10వ తేదీన తెరపైకి రావడం, వి అక్షరాలతో చిత్ర పేర్లు నిర్ణయించడం అన్నది కాకతీళీయమా? లేక సెంటిమెంట్‌గా భావించి ఆ తేదీల్లో విడుదలకు ప్లాన్‌ చేసుకుంటున్నారా? అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

English summary
The duo have not only retained the 'V sentiment in the titles of their films. Sources reveal that they have decided to retain the release date sentiment with regards to 'Vivegam'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu