twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలిప్రేమ రోజుల్లోనే లాక్ డౌన్ పరిచయం చేసిన పవన్.. ఆసక్తికర విషయం పంచుకున్న వివేక్ ఆత్రేయ

    |

    నాని హీరోగా నటించిన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా జూన్ పదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అంగరంగవైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరైన సందర్భంగా సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

    Recommended Video

    Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
    పెద్ద సెలబ్రేషన్ ఏముంది?

    పెద్ద సెలబ్రేషన్ ఏముంది?


    దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ముందుగా ఈవెంట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మేమందరం సినిమా ఫస్ట్ కాపీ చూసి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎక్కడికో ఒక చోటికి వెళదామని అనుకున్నామని అయితే ఈ సమయంలో నవీన్ గారు వచ్చి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు అని పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఈవెంట్ కు రావడం కంటే పెద్ద సెలబ్రేషన్ ఏముందని ఆయన ప్రశ్నించారు.

    గర్వంగా భావించా

    గర్వంగా భావించా


    పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపడంతో ఆయన కూడా ప్రతిస్పందిస్తూ పర్లేదు అంటూ సైగలు చేశారు. ఆ తర్వాత తనతోపాటు డైరెక్షన్ టీమ్ లో పనిచేసిన అందరిని వేదిక మీదకు పిలిచారు. తన డైరెక్షన్ టీం లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరుపేరునా పరిచయం చేసిన వివేక్ ఆత్రేయ వీరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఈ రోజు అంటే సుందరానికి సినిమా లేదని ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ కూడా తన గురించి తాను గొప్పగా ఫీల్ అవ్వలేదు కానీ ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత గర్వంగా భావించానని వివేక్ ఆత్రేయ వెల్లడించారు.

     ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ

    ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ


    ఆ గర్వం తానేదో చేసేశాను అది కాదని ఇలాంటి ఒక అద్భుతమైన టీంని నేను సెట్ చేసుకున్నాను అనే ఉద్దేశంతో గర్వంగా ఫీల్ అయ్యాను అని అన్నారు. హీరో నాని, హీరోయిన్ నజ్రియా, నదియా, రోహిణి, నరేష్, పెరుమాళ్ అంటూ పేరుపేరునా ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కుతుందని భావించి తన మీద నమ్మకం ఉంచిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు.

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్


    ఇక ఈ సినిమాకు వివేక్ సాగర్ అందించిన సంగీతం అద్భుతంగా కుదిరింది అని చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో వివేక్ సాగర్ ఫ్యాన్స్ అందరూ కూడా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని అన్నాడు. ఆ తర్వాత ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తమ అనుభవాన్ని పంచుకున్నాడు.

    తొలిప్రేమ రోజుల్లోనే

    తొలిప్రేమ రోజుల్లోనే


    మీరంతా ఇప్పుడు లాక్ డౌన్ చూస్తున్నారు నేను తొలిప్రేమ రోజుల్లోనే ఆ లాక్ డౌన్ చూశా అని చెప్పుకొచ్చాడు. తొలిప్రేమ సినిమా మొట్టమొదటి సారి టీవీలో టెలికాస్ట్ అవుతుంది అని తెలిసి నరసరావుపేట మొత్తం ఖాళీ అయిందని రోడ్డుమీద ఎవరూ కనిపించకుండా అందరు టీవీ లకే పరిమితం అయ్యారు అని చెప్పుకొచ్చాడు.

    English summary
    vivek atreya interesting comments about pawan kalyan in ante sundaraniki pre release event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X