»   » పవన్ కళ్యాణ్ అన్నయ్య లాంటోడు, మద్దతుతో రక్త సేకరణ

పవన్ కళ్యాణ్ అన్నయ్య లాంటోడు, మద్దతుతో రక్త సేకరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇటీవల చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చుని అందరి దృష్టినీ ఆకర్షించారు. అనంతరం ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి తన మనసులో మాటలను బయట పెట్టారు.

'పవన్ కళ్యాణ్ నాకు అన్నయ్య లాంటి వారు. దాదాపు ఐదారేళ్ల క్రితం ఆయన్ను కలిసాను. ఆయన సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే నేను ఆయన అభిమానిని. ఆయనపై నాకు గౌరవం ఏర్పడటానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆయన జనసేన పార్టీ పెట్టింది కేవలం ప్రజలకు సేవ చేయడానికే అనేది చాలా గొప్ప విషయం' అని వివేక్ ఒబెరాయ్ చెప్పుకొచ్చారు.

మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

లక్ష లీటర్ల రక్తం సేకరణ

లక్ష లీటర్ల రక్తం సేకరణ

‘బ్లడ్ బ్యాంకుల కోసం భారీ ఎత్తున రక్తాన్ని సేకరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఒక రోజులో లక్ష లీటర్ల రక్తాన్ని సేకరించాలని అనుకుంటున్నాం. దీని గురించి పవన్ కళ్యాణ్ అన్నకు చెప్పాను. ఈ విషయం విని ఆయన ఎంతో మెచ్చుకున్నారు' అని వివేక్ ఒబెరాయ్ తెలిపారు.

పవన్ కళ్యాన్ సపోర్ట్

పవన్ కళ్యాన్ సపోర్ట్

తన వంతు సపోర్ట్ కూడా అందిస్తానని చెప్పారు. ప్రజల కోసం జరిగే ఈ కార్యక్రమానికి ఆయన మద్దతు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ప్రజల మనిషి అనడానికి ఇదే నిదర్వనం. త్వరలో పవన్ అన్నను కలుస్తాను' అని వివేక్ ఒబెరాయ్ తెలిపారు.

రాజకీయాల గురించి

రాజకీయాల గురించి

‘నేను రాజకీయాల్లోకి చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. సమాజ సేవకడిగా ఉండాలనేదే నా కోరిక. సమాజంలో మార్పు తేవడానికి నా వంతు సహాయం చేస్తాను' అని వివేక్ ఒబెరాయ్ తెలిపారు.

పరిటాల సునీతకు శుభాకాంక్షలు

పరిటాల సునీతకు శుభాకాంక్షలు

‘రక్త చరిత్ర' సినిమాలో పరిటాల రవి పాత్ర పోషించి వివేక్ ఒబెరాయ్....పరిటాల సునీతకు చంద్రబాబు నాయుడు మహిళా శిశుసంక్షేమ శాఖను కేటాయించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంగ్రాచ్యులేషన్స్ సునీతా అక్కా అంటూ మెసేజ్ పంపారు. అక్క సునీతకు మంత్రి పదవి వచ్చినందుకు తనకు ఎంతగానో సంతోషంగా ఉన్నదని చెప్పుకొచ్చారు.

English summary
Vivek Oberoi says, “Pawan Kalyan is like an elder brother to me. I met him around five-six years ago. Then, I was just a fan of his movies, but now I respect him for many other reasons.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X