»   »  చిరంజీవి అంటే ఇంత చిన్న చూపా..!? మెగాస్టార్ సినిమాలో వద్దని తమిళ్ సినిమాలో చేస్తున్నాడు...

చిరంజీవి అంటే ఇంత చిన్న చూపా..!? మెగాస్టార్ సినిమాలో వద్దని తమిళ్ సినిమాలో చేస్తున్నాడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ యాక్టర్స్ కు మామూలుగానే దక్షిణాది ఇండస్ట్రీ అంటే కొన చిన్న చూపుగానే ఉంటుంది. నటులకే కాదు ప్రేక్షకుయ్లకు కూడా అదే అభిప్రాయం ఉంటుంది. తెలుగు సినిమా నటుల మీద కూడా జోకులేసుకునే ఈ జనానికి బాహుబలి లాంటి గట్టి దెబ్బలు మరికొన్ని పడాల్సిందేనేమో. నిజానికి బాలీవుడ్ సినిమాలని తమిళ్ లో కంటే తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ఆదరిస్తారు. మన వాళ్లకి సినిమా బావుంటే చాలు అది ఏభాషా చిత్రం, దానిలో స్టార్ హీరో ఉన్నాడాలేదా అన్నది అనవసరం...

కానీ తమిళ ఇండస్ట్రీ గానీ, తమిళ ప్రేక్షకులు గానీ పరభాషానటులనూ, పరభాషా సినిమాలనూ పెద్దగా పట్టించుకోరు. అయినా సరే బాలీవుడ్ నటులకు తమిళ పరిస్రమ మీదనే ప్రేమ ఎక్కువ. తెలుగు వాళ్ళని మరీ చీప్గా చూసే స్వభావం వారిలో ఎక్కువే. అయితే వాళ్ళ సినిమాల్లో నటించేటప్పుడు ఉండే ఒక గొప్ప విషయం ఏమిటంటే...

chiru

బాలీవుడ్ యాక్టర్స్ కు హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్, షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్ లో అలరించారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా రోబో సినిమా సీక్వల్ కోసం విలన్ గా మారిపోయారు. అదే బాటలో మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ 3 సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు.

దీంతో తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో విలన్ గా వివేక్ ఓబెరాయ్ ను నటించాల్సిందిగా కోరారు. కానీ అప్పట్లో చిరుకు విలన్ గా చేసేందుకు నో చెప్పిన వివేక్ ఇప్పుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విలన్ గా నటించేందుకు అంగకీరించాడట. ఇప్పటికే అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్స్ అందించిన శివ మరోసారి తలాతో కలిసి మ్యాజిక్ రిపీట్చేయాలని భావిస్తున్నాడు.

ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో పాటు జేమ్స్ బాండ్ తరహా సినిమా కావటంతో విలన్ పాత్ర స్టైలిష్ గా ఉండబోతోందని వివేక్ ఈ ఆఫర్ ను ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇదన్న మాట సంగతి ఇక్కడ మెగాస్టార్ సినిమాకి మాత్రం నో చెప్పి అక్కద మాత్రం ఒప్పేసుకున్నాడు. అదీ వీళ్ళ తీరు... రెమ్యునరేషన్ విషయం లోనూ, నటులమీద అభిమానం విషయం లోనూ తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులూ చూపించే అభిమానాన్ని వీళ్ళెప్పటికి అర్థం చేసుకుంటారో...

English summary
Bollywood Star Vivek Oberoi leaves Megastar's offer to clinch Ajith's film, Vivek to make Tamil debut with Ajith's upcoming film
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu