చెర్రీ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో.. ఎంట్రీ సీన్‌కే బోయపాటి ఫిదా!

By Rajababu

బాలీవుడ్‌ హీరో వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు విలన్ పాత్రలపై కన్నేశాడు. గతంలో క్రిష్3 చిత్రంలో విలన్ మెప్పించిన వివేక్.. ఇటీవల తమిళంలో అజిత్ నటించిన వివేకంలో తన నటనతో అలరించాడు. అలాగే రాంగోపాల్ వర్మ రూపొందించిన కంపెనీ, రక్త చరిత్ర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా మెగా పవర్‌స్టార్ రాంచరణ్ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, ఇటీవల వివేక్ ఒబెరాయ్‌ ఎంట్రీ సీన్‌ను విజయవాడలో బోయపాటి చిత్రీకరించారు. ఆ సన్నివేశంలో వివేక్ ఒబేరాయ్ నటనను చూసి బోయపాటి ఇంప్రెస్ అయ్యాడట. సీన్‌లో వివేక్ ఇన్వాల్వ్‌మెంట్ చూసి బోయపాటి ప్రశంసల వర్షం కురిపించారట.

Vivek Oberoi playing antagonist in Ram Charan, Boyapati film

రాంచరణ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకునే చిత్రంలో కియారా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా రమ్యకృష్ణ కీలకపాత్రను పోషిస్తున్నారు. భరత్ అనే నేను లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X