»   » సినిమాలో ఆయన కాస్ట్యూమ్ బరువు 28 కేజీలట!

సినిమాలో ఆయన కాస్ట్యూమ్ బరువు 28 కేజీలట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాల్లోని నటులు పాత్రలకు తగిన విధంగా వివిధ రకాలైన కాస్ట్యూమ్స్ ధరించడం మామూలే. కాస్ట్యూమ్స్ ఎంత భారీగా ఉన్నా వాటి బరువు మహా అయితే 5 కేజీలకు మించదు. కానీ క్రిష్-3 చిత్రంలో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఏకంగా 28 కేజీల బరువు ఉండే కాస్ట్యూమ్స్ ధరించాడట.

ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఆయన లుక్ పాత్రకు తగిన విధంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేసారు. మెటల్‌తో తయారు చేయడంతో దాని బరువు 28 కేజీలకు చేరిందట. సినిమాలో తన పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్న వివేక్ ఆ బరువును లెక్కచేయకుండా ఇష్టపడి ఆ పాత్రలో అద్భుతంగా నటించాడట.

కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న వివేక్ ఈ చిత్రం విజయవంతమైతే తన దశ తిరుగుతుందనే ఆశతో ఉన్నాడు వివేక్. ఈ చిత్రం తో పాటు వివేక్ నటించిన 'గ్రాండ్ మస్తి' అనే మరో చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. మరి వివేక్ లక్ ఎలా ఉందో చూడాలి.

ఇక క్రిష్-3 సినిమా విషయానికొస్తే...రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

గతంలో రూపొందిన రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. క్రిష్-3 చిత్రంలో హృతిక్ రోషన్ సూపర్ మేన్ పాత్రలో కనిపించబోతునప్నాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈచిత్రం విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని ఈ ట్రైలర్ ను బట్టి స్పష్టం అవుతోంది. దీపావళికి ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
After a dimmed phase in career, this year Vivek Oberoi is all set to have his two releases, 'Krrish 3' and 'Grand Masti'. He has worked hard for his antagonist role in 'Krrish 3' and tired to make it as perfect as possible by working upon the looks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu