»   » చిరంజీవిపై నమ్మకం లేదు! ఎన్టీఆర్ వైపు గేర్ మార్చిన వినాయక్

చిరంజీవిపై నమ్మకం లేదు! ఎన్టీఆర్ వైపు గేర్ మార్చిన వినాయక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు వివి వినాయక్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి కథ విషయంలో బాగా నాన్చుతుండటంతో సినిమా ముందుకు సాగడం లేదు. ఆల్రెడీ దర్శకుడు పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం కష్టపడి కొంత సమయం వేస్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ ‘అఖిల్' సినిమా ప్లాప్ కావడంతో కాస్త డల్ అయిపోయిన వివి వినాయక్.... చిరంజీవి 150వ సినిమా అవకాశం వస్తుందని ఎదురుచూస్తే విలువైన సమయం కోల్పోతానని గ్రహించినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్టు జూ ఎన్టీఆర్ తో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

VV Vinayak next movie with NTR

వినాయక్ తో చేయడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్ధమే. అందుకే తారక్ ఇమేజ్ కు తగిన విధంగా ఒక మంచి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడట. అఖిల్ సినిమా తర్వాత రెండు నెలలు గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన వినాయక్ ఇందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.

మరో వైపు ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్లో సినిమా వచ్చి చాలా కాలం అయింది. చివరగా వచ్చిన అదుర్స్ మూవీ అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇందులో కామెడీ యాంగిల్, యాక్షన్ యాంగిల్ కలగలిపి మాసివ్ హిట్ అందించాడు వినాయక్. ఈ సారి కూడా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

English summary
Film Nagar source said that, After Akhil movie VV Vinayak planing his next project with NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu