For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వినాయిక్ 'అల్లుడు శీను' కథ ఇదేనట

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టీ వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొంది విడుదలకు సిద్దంగా ఉన్న 'అల్లుడు శీను' పై ఉంది. ఇప్పటికే ట్రైలర్స్, పాటలతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రంతో బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం కథేముంటుంది. కొత్తగా హీరోగా పరిచయమవుతున్న ఈ హీరోకి ఏ కథ అయితే సరిపోతుందని వినాయిక్ భావించాడు అనే విషయంపై అంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథపై చిన్న క్లూ ఇచ్చారు వినాయిక్. కథ గురించి ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు.

  సినిమా కథ విషయానికొస్తే, హీరో అనాథ. అతన్ని ప్రకాశ్‌రాజ్‌ 'అల్లుడు.. అల్లుడు' అని పిలుస్తుంటే, హీరో ఆయన్ని 'మావా.. మావా' అని పిలుస్తుంటాడు. ఒకానొక సమయంలో ప్రకాష్‌రాజ్‌ చేయని తప్పుకు నిందలపాలవుతాడు. దీన్ని నుంచి అల్లుడుశీను మామ ప్రకాష్‌రాజ్‌ను ఎలా బయటపడేశాడనేది కథ. దానికి సమాంతరంగా ప్రేమకథ నడుస్తుంది. ప్రకాశ్‌రాజ్‌ కేరక్టర్‌లో ట్విస్ట్‌ ఉంటుంది.

  VV Vinayak revels Story of Alludu Srinu

  అలాగే బ్రహ్మానందంను ఓసారి బురిడీ కొట్టించడానికి తన పేరు 'అల్లుడు శీను' అని చెబుతాడు హీరో. బ్రహ్మానందం కూడా అతని పేరు నిజంగా అదేనని నమ్ముతాడు. అదొక ట్రాక్‌గా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. సెకండాఫ్‌లో 45 నిమిషాల సేపు నాన్‌స్టాప్‌గా నవ్వుతాం అని చెప్తున్నారు. ఆడియోకు ఫెంటాస్టిక్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అన్ని పాటలూ బాగున్నాయంటున్నారు.


  ఇక బాబీ ఈ కథ చెప్పగానే కోన వెంకట్‌, గోపీమోహన్‌తో దీన్ని బాగా చేసుకోవచ్చని అనిపించింది. ఫైనల్‌ స్ర్కిప్ట్‌ వచ్చాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను. దాంతో ఆడుతూ పాడుతూ సరదాగా తీశాం. ఈ స్ర్కిప్టుకి ముందు చాలా స్ర్కిప్టులు అనుకున్నాం. తృప్తి కలగక ఇంకా ఇంకా వింటూ వచ్చాం. ఈ లైన్‌ వినగానే కొత్తగా అనిపించింది. శ్రీనివాస్‌ నేననుకున్న దానికన్నా బాగా చేశాడు. ఏ రేంజి స్టార్‌ అవుతాడో చెప్పలేను కానీ చాలా మంచి హీరో అవుతాడు. ప్రేక్షకులందరికీ నచ్చుతాడు అని వినాయిక్ చెప్పారు.

  అంతేకాదు...నా చిత్రాల్లో ఏమేం ఉంటాయో అన్నీ ఇందులో ఉంటాయి. శ్రీనివాస్‌ పదో తరగతి తర్వాత చదువును ప్రైవేటుగా కొనసాగించాడు. ఫుల్‌టైమ్‌ యాక్టింగ్‌ స్కూలులో గడిపాడు. ముంబై, లాస్‌ ఏంజిల్స్‌, వియత్నాం తదితర ప్రాంతాల్లో బాడీ బిల్డింగ్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌లలో శిక్షణ పొందాడు. భారీ హంగులతో తెరకెక్కిన చిత్రమిది. ప్రతీ సన్నివేశం ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది అని అన్నారు.

  ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:్ఛటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

  English summary
  In Alludu Srinu story... The Hero in this film is an orphan. Prakash Raj character takes care of him and calls him ‘Alludu’ with fondness and that’s how the title came up. There is a comedy dialogue about this as well saying ‘Amma Rajasrkhar, Thammudu Satyam undaga lenidhi Alludu Seenu unte tappa?’ which feature Brahmanandam and Sreenivas. That’s how we tried to justify the title.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more