»   » మెగా మేనల్లుడితో వినాయక్ మూవీ షురూ (ఫోటోస్)

మెగా మేనల్లుడితో వినాయక్ మూవీ షురూ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, లావణ్య త్రిపాఠి కథానాయికగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.4గా సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం బుధవారం ఉదయం 9.27 గంటలకు ప్రారంభమైంది.

మెగాస్టార్‌ చిరంజీవి చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ అందించిన ఆశీస్సులతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హీరో సాయిధరమ్‌తేజ్‌పై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ నివ్వగా, మరో ప్రముఖ రచయిత సత్యానంద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ఖైదీ తర్వాత వినాయ్ చేస్తున్న మూవీ

ఖైదీ తర్వాత వినాయ్ చేస్తున్న మూవీ

మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఖైదీ నెం 150' సినిమా ద్వారా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వినాయక్.... ఇంతకాలం స్క్రిప్టులు వినడంపైనే ఫోకస్ పెట్టారు. ఎట్టకేలకు ఆకుల శివ చెప్పిన కథ నచ్చడంతో మెగామేనల్లుడితో సినిమా మొదలు పెట్టారు.

ఫస్ట్ షాట్

ఫస్ట్ షాట్

ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన ఆకుల శివ ఫస్ట్‌ షాట్‌ని డైరెక్ట్‌ చేశారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ మదర్ శ్రీమతి విజయదుర్గ స్క్రిప్ట్‌ని అందించారు.

Sanjay Dutt role replaced by Sai Dharam Tej
షూటింగ్ డిటేల్స్

షూటింగ్ డిటేల్స్

ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించే ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి కథ, మాటలు: ఆకుల శివ, సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, మేకప్‌: బాషా, కాస్ట్యూమ్స్‌: వాసు, స్టిల్స్‌: శ్రీను, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: జి.జి.కె.రాజు, సతీష్‌ కొప్పినీడి, కోడైరెక్టర్స్‌: సూర్యదేవర్‌ ప్రభాకర్‌ నాగ్‌, పుల్లారావు కొప్పినీడి, సహనిర్మాతలు: సి.వి.రావు, పత్స నాగరాజా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

English summary
Tollywood star Sai Dharam Tej New Film Launched Today Directed VV Vinayak. After making Chiranjeevi 150th film, Khaidi No.150 Popular Director V V Vinayak did not make any movies. V V Vinayak had to take some gap. Now V V Vinayak back into action with fresh script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu