»   » నాగచైతన్యకు నాకు ఎప్పుడో పెళ్లైపోయింది.. సమంత షాకింగ్ ట్వీట్

నాగచైతన్యకు నాకు ఎప్పుడో పెళ్లైపోయింది.. సమంత షాకింగ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవునండీ.. ఈ మాట ఎవరో చెపితే గాసిప్ అని కొట్టేయవచ్చు. కానీ ఏకంగా సమంత రుత్ ప్రభు చెబితే నమ్మాల్సిందే. కానీ ఈ వార్తకు షరతులు వర్తిస్తాయి అంటున్నది సమంత రుత్ ప్రభు. వచ్చే అక్టోబర్‌లో పెళ్లికి హడావిడి జరుగుతుంటే ఇటీవల సమంత ట్విట్టర్‌లో మాకు ఇప్పటికే పెళ్లి అయిపొయిందని ట్వీట్ చేయడంతో చాలా మంది కంగారు పడ్డారు. ఇంతకీ ఈ ట్వీట్ వెనుక ఉన్న ఎమోషనల్ మతలబు ఏమిటంటే..

ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది..

ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది..

పెళ్లి అక్టోబర్‌లో జరుగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ మానసికంగా నాకు నాగచైతన్యకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఈ విషయంలో మాకంటే ఎక్కువగా ఆనందించే వాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని వివరణ ఇచ్చారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత వైభవంగా, సెన్సేషనల్ వివాహంగా నాగచైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్ 6న పెళ్లికి ఏర్పాట్లు

అక్టోబర్ 6న పెళ్లికి ఏర్పాట్లు

2010లో ఏ మాయ చేసావే చిత్ర షూటింగ్‌లో జరిగి నాగ చైతన్య, సమంతల మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా అఫైర్‌ను నెట్టుకొచ్చారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్న అనంతరం ఇరు కుటుంబాలకు తమ ప్రేమను వెల్లడించారు. వచ్చే అక్టోబర్‌లో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 6న గోవాలోని ఓ చర్చిలో క్రైస్తవ మతాచారం ప్రకారం పెళ్లి జరుగుతుంది. అనంతరం హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకను జరిపేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

100 మంది అతిథులకు ఆహ్వానం

100 మంది అతిథులకు ఆహ్వానం

గోవాలోని చర్చిలో జరిగే వివాహ వేడుకకు కేవలం వందమందిని మాత్రమే ఆహ్వనిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ పెళ్లికి హాజరయ్యే వారిలో కేవలం ఇరు కుటుంబాలకు సంబంధించిన ముఖ్యమైన వారే ఉంటారనేది లేటెస్ట్ న్యూస్. గోవాలోని సముద్రం ఒడ్డున ఉన్న హెరిటేజ్ చర్చిలో చైతూ, సమంత ఇద్దరు ఒక్కటవుతారనేది విశ్వసనీయ సమాచారం.

40 రోజులపాటు హానీమూన్

40 రోజులపాటు హానీమూన్

పెళ్లి అనంతరం దాదాపు 40 రోజులపాటు నాగచైతన్య, సమంత హానీమూన్‌కు వెళ్లనున్నారు. తమ హానీమూన్ వివరాలను సమంత తమతో పంచుకొన్నారని ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ‘మేము చాలా ఉత్సాహం, జోష్‌తో ఉన్నాం. ఆ ఎక్సైట్‌మెంట్‌ను మాటల్లో చెప్పలేను. చాలా సుదీర్ఘమైన యాత్ర లాంటింది. దాదాను 40 రోజులపాటు ప్లాన్ చేశాం. ఆ హానీమూన్ యాత్రను రెండు నెలలుగా పొడిగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని సమంత అన్నట్టు కథనంలో పేర్కొన్నారు.

షూటింగులు కంప్లీట్ చేసుకొనే పనిలో..

షూటింగులు కంప్లీట్ చేసుకొనే పనిలో..

సెప్టెంబర్ నెలఖారువరకే నాగ చైతన్య, సమంత తమ షూటింగులను కంప్లీట్ చేసుకొనే పనిలో ఉన్నారు. తమ సినిమాలకు సంబంధించిన షూటింగులను ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముగించాలని నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నారట. తాజాగా తమిళంలో శివకార్తీకేయన్ నటించే చిత్రంలో సమంత నటిస్తున్నది. ఈ చిత్రం సోమవారం (జూలై 10న) ప్రారంభమైంది.

English summary
Samantha said, “In my head I am married to him already,so I think everyone else is more excited than the both of us.” Now you tell us! Should we be blamed for that headline? It came straight from the horse’s mouth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu