twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గబ్బర్ సింగ్’ విజయం వెనక...అసలు రహస్యం అదా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం గత సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయం వెనక పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, దర్శక నిర్మాతల కృషితో పాటు....పరోక్షంగా మరొకరి కష్టం కూడా ఉంది.

    'గబ్బర్ సింగ్' సినిమా విడుదలకు ముందే నిర్మాత బండ్ల గణేష్ సోదరుడు బండ్ల శివ ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ షాద్‌నగర్ నుంచి శ్రీశైలం వరకు 205 కిలోమీటర్లు నడిచి శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని వేడుకున్నాడట. పూర్తిగా కాక పోయినా ఎంతో కొంత శివ కూడా ఈ సినిమా విజయానికి దేవుని చల్లని చూపులు పడేలా చేసాడు అని అంటున్నారంతా.

    'గబ్బర్ సింగ్' చిత్రం బిగ్ స్క్రీన్‌పైనే కాదు... స్మాల్ స్క్రీన్‌పై కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈచిత్రం బుల్లితెరపై మగధీర రికార్డును బద్దలు కొట్టింది. నెం.1 హిట్ సినిమాగా రుజువు చేసుకుంది. పవన్ కళ్యాణ్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో నిరూపించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అత్యధిక పాయింట్లు సాధించడమే కాదు... గత రికార్డులను బద్దలు కొట్టేసింది. గతంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్ రికార్డు రాజమౌళి దర్వకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రంపై ఉండేది. తాజాగా ఆ రికార్డును గబ్బర్ సింగ్ తిరగరాసాడు.

    మగధీర చిత్రం జులై 31, 2009లో విడుదలయింది. వెండితెరపై అప్పట్లో నెం.1 హిట్‌గా నిలిచిచిన ఈచిత్రం..... బుల్లితెరపై ప్రదర్శించగా అత్యధికంగా 22 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలు టీవీల్లో ప్రదర్శించ బడ్డాయి. అయితే ఏ సినిమా కూడా ఆ మార్కును అందుకోలేక పోయాయి.

    చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ చిత్రం ఆమార్కును క్రాస్ చేసి 'మగధీర' రికార్డను బద్దలు కొట్టింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా టీవీల్లో ప్రసారం అయిన గబ్బర్ సింగ్ చిత్రానికి అత్యధికంగా 24 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది.. దీంతో మగధీర చిత్రం నెం.2 స్థానానికి వెళ్లి పోయింది. పవన్ కళ్యాణ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించారు.

    English summary
    
 Producer Bandla Ganesh brother Shiva Babu Bandla an ardent Pawan Kalyan fan. Before ‘Gabbar Singh’ released, Shiva Babu vowed to walk all the way from Shadnagar to Srisailam if the movie turned out to be a hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X