For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya చిరంజీవి Vs రవితేజ.. ఒకరి డైలాగ్ లతో మరొకరు.. పూనకాలు తెప్పించేలా ట్రైలర్!

  |

  మెగా స్టార్ చిరంజీవి-మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అదిరిపోయాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జనవరి 8న అంటే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇవాళ వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

   అభిమానలకు మెగా ట్రీట్..

  అభిమానలకు మెగా ట్రీట్..

  స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ బాస్ గా మారాడు. ఖైదీ నెం 786 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే ఆచార్యతో ప్లాప్ అందుకున్న చిరు ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం సాధించారు. ఇప్పుడు మరో సినిమాతో అభిమానులను, టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ముందుకు వస్తున్నాడు.

  స్టార్ హీరోలు మరోసారి కలిసి..

  స్టార్ హీరోలు మరోసారి కలిసి..

  బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజ రవితేజ అలరించనున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

  జనవరి 8న విశాఖలో..

  జనవరి 8న విశాఖలో..

  టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై క్రేజీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ మెగా అభిమానులను అలరించింది. ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి, వీరయ్య, పూనకాలు లోడింగ్ పాటలకు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న విశాఖలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఇవాళ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

  మాస్ అనే పదానికి బొడ్డు కోసి..

  మాస్ అనే పదానికి బొడ్డు కోసి..

  ట్రైలర్ విషయానికొస్తే.. మాస్ మసాలా వంటి అన్ని అంశాలతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా చిరంజీవి డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. ఇందులో చిరంజీవి ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీలర్ అని రివీల్ చేశారు. అతన్ని పట్టుకునేందుకు పోలీస్ అధికారిగా రవితేజ కనపించాడు. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టింది ఆయన్ను చూసే అంటూ చిరు గురించి హైఓల్టేజ్ ఎలివేషన్ ఇచ్చారు. రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీద రికార్డులు ఉంటాయి, వీడు నా ఎర నువ్వే నా సొర అంటూ చిరు మాస్ డైలాగ్ లు విజిల్స్ వేయించేలా ఉన్నాయి.

  ఒకరి డైలాగ్ లతో మరొకరు..

  వైజాగ్ లో గట్టి వేటగాడు లేడని.. ఒక పులి పూనకాలతో ఊగుతుందట అంటూ రవితేజ ఎంట్రీ చూపించారు. సినిమాలో చిరంజీవికి రవితేజకి మధ్య గట్టి వార్ ఉండనున్నట్లు చూపించారు. ఇక చివర్లో.. హలో మాస్టారు.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. ఒక్కొక్కనికి బాక్సులు బద్దలైపోతాయి.. అని చిరంజీవి డైలాగ్ రవితేజ చెప్పడం.. ఏంట్రా బద్దలయ్యేది.. ఈ సిటీకి నీలాంటి కమిషనర్ లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ ఇక్కడ వీరయ్య లోకల్.. అని రవితేజ ఇడియట్ డైలాగ్ చిరు చెప్పడం అదిరిపోయింది. ఈ సినిమాతో అభిమానులకు థియేటర్లో పూనకాలే అనిపించేలా ట్రైలర్ ఉంది.

  English summary
  Chiranjeevi Ravi Teja High Voltage Performance Movie Waltair Veerayya Trailer Released And Chiru Stuns With His Action
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X