Just In
- 1 hr ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
- 2 hrs ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 2 hrs ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 3 hrs ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
Don't Miss!
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- News
వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..
- Finance
ఈఎస్ఐ పథకంలో చేరిన 9.33 లక్షల మంది.. డేటా రిలీజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనంత శ్రీరామ్ మాటలకే పవన్ కళ్యాణ్ స్పందన
హైదరాబాద్: వెంకటేష్‌తో తాను కలిసి నటించిన గోపాల గోపాల ఆడియో కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతా ఆధ్యాత్మికం గురించి, జీవిత పరమార్థం గురించే మాట్లాడాలని అనుకున్నట్లు ఆయన ధోరణి కనిపించింది. కానీ, మధ్యలో రాజకీయాలకు సంబంధించి ఓ మాట మాట్లాడి కలకలం సృష్టించారు. ఆడియో విడుదల వేడుకలో అనంత శ్రీరామ్ పవన్ కళ్యాణ్ కన్నా ముందు మాట్లాడురు. వెంకటేష్ గురించి మాట్లాడిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు పిచ్చి అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల పిచ్చి అనేదానికి అర్థం మారిపోయిందని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఎనలేని అభిమానులు ఉన్నారని ఆయన చెప్పారు. వెంకటేష్‌కు తాను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పాట రాశానని ఆయన చెప్పారు. అయితే, తనను ఓ యువకుడు, ఓ వృద్ధుడు - "మాకు పవన్ కళ్యాణ్ అంటే మహా పిచ్చి, పవన్ కళ్యాణ్‌కు పాట రాయకూడదా అని అడిగార"ని ఆయన చెప్పారు.

గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్‌కు పాట రాశానని చెబుతూ ఆ పాటకు చెందిన రెండు లైన్లను ఆయన పాడి వినిపించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేస్తారో... అంటూ రాజకీయాలను ఆ రకంగా ప్రస్తావించారు. ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పి వదిలేశారు.
ఆ తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన జీవితంలోని పలు సంఘటనలను వివరిస్తూ, తన అన్నయ్య చిరంజీవి తన జీవితాన్ని మార్చిన తీరును చెబుతూ రాజకీయాల గురించి అన్యాపదేశంగా చెప్పినట్లు చెప్పారు. వెంకటేష్, తాను ఎప్పుడూ ఆధ్యాత్మిక చర్చనే చేసుకుంటామని చెప్పారు. దేవుడి గురించి మాట్లాడుతూ - "రాజకీయాలా, ఉండనే ఉంటాయి, రాజకీయాలకు భుజం కాస్తా" అని అన్నారు. అనంత శ్రీరామ్ చెప్పినదానికి సమాధానం అని అనిపించకుండా ఆధ్యాత్మికం, సేవ, తన అభిమానుల ప్రతిస్పందన వంటి విషయాలు మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు.