»   » ఆన్‌లైన్లో రిలీజ్ అవుతున్న మెగాఫ్యామిలీ మూవీ

ఆన్‌లైన్లో రిలీజ్ అవుతున్న మెగాఫ్యామిలీ మూవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా అభిమానులకు శుభవార్త. తొలిసారిగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరో మూవీ థియేటర్లతో పాటు, డైరెక్టుగా ఆన్ లైన్లో కూడా విడుదలకు సిద్దం అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు 'అలియాస్ జానకి'. చిరంజీవి మేనమామ కొడుకు అయిన వెంకట్ రాహుల్ 'అలియాస్ జానకి' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు.

థియేటర్లతో పాటు ఆన్‌లైన్లో విడుదల చేయడం ద్వారా మంచి కలెక్షన్స్ వస్తాయని ఈ చిత్ర నిర్మాత నీలిమ తిరుమలశెట్టి భావిస్తున్నారు. మరో విశేషం ఏమింటే ఆన్‌లైన్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా కూడా ఇదే. zingreel అనే మూవీ పోర్టల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఆన్‌లైన్లో ఈ చిత్రాన్ని చూసేందుకు ఒక షోకు $4.99 డాలర్లుగా నిర్ణయించారు. విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. పైరసీ‌కి ఆస్కారం లేకుండా ఈ చిత్రాన్ని ఆన్‌లైన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 26న ఈచిత్రం విడుదలువుతోంది.

ఆన్‍‌లైన్లో చూసేందుకు ప్రేక్షకులను ఎలా ఆకర్షిస్తారంటే...?

ఆన్‍‌లైన్లో చూసేందుకు ప్రేక్షకులను ఎలా ఆకర్షిస్తారంటే...?


విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రాన్ని ఆన్‌లైన్లో చూసే విధంగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం చేయనున్నారు. అదే విధంగా విదేశాల్లో ఉన్న 2 లక్షల తెలుగు ప్రేక్షకులకు పర్సనల్‌గా ఈమెయిల్స్ పంపి ఈచిత్రానికి ప్రచారం కల్పిస్తామని నిర్మాత నీలిమ అంటోంది.

విదేశాల్లో తెలుగు ప్రేక్షకుల ప్రాబ్లమ్స్ తెలుసు

విదేశాల్లో తెలుగు ప్రేక్షకుల ప్రాబ్లమ్స్ తెలుసు


తాను 12 సంవత్సరాలు అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉన్నానని, అక్కడి తెలుగు ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు పడే ఇబ్బందులు తనకు తెలుసు అంటోంది నీలిమ. అక్కడ తెలుగు సినిమాలు చాలా తక్కువ థియేటర్లలో ప్రదర్శితం అవుతాయి. వాటిని చూడాలంటే మైళ్ల కొద్దీ ప్రయాణం చేయాలి. ఆన్‌లైన్లో సినిమా విడుదల చేయడం వల్ల వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుందని చెబుతోంది.

సెన్సార్ రిపోర్ట్

సెన్సార్ రిపోర్ట్


తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రాన్ని జులై 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

సినిమాలో ముఖ్యమైన వారు

సినిమాలో ముఖ్యమైన వారు


వెంకట్ రాహుల్, అనీషా అంబ్రోస్, శ్రీ రమ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'అలియాస్ జానకి'. సంఘ మిత్ర ఆర్ట్స్ నిర్మిస్తోంది. తారా అరుళ్‌రాజ్ సమర్పకుడు. నీలిమ తిరుమలశెట్టి నిర్మాత. దయా కె ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మెగా సపోర్టు

మెగా సపోర్టు


ఈ చిత్రం హీరోకు మెగా రిలేషన్ ఉండటంతో అలియాస్ జానకి చిత్రానికి అభిమానుల నుంచి మెగా సపోర్ట్ లభిస్తోంది. ఇటీవల చిరంజీవి తల్లి అంజనాదేవితో ఆ చిత్రం ఆడియో సీడీలు విడుదల చేయించారు. దీంతో సినిమాకు పబ్లిసిటీ పెరిగింది.

నాగబాబు ఏమన్నారంటే

నాగబాబు ఏమన్నారంటే


ఈ సందర్భంగా నాగ బాబు మాట్లాడుతూ...‘రాహుల్ మా మేన మామ కొడుకే. ఈ చిత్రం కథను తనే తయారు చేసుకున్నాడు. ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాడు. ఇందులో అతనికి తండ్రిగా నటించాను' అని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో

పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో


పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాతోనే చిన్న సినిమాలు చేస్తున్నానని నిర్మాత నీలిమ తిరుమలశెట్టి అంటున్నారు. గతంలో నీలిమ తిరుమల శెట్టి పవన్ కళ్యాణ్ హీరోగా పంజా చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది.

తారాగణం

తారాగణం

నాగబాబు, తనికెళ్ల భరణి, శివ నారాయణ, భరణి శంకర్, శత్రు, వంశీ రెడ్డి, రమేష్ వేంపల్లి, మీనా కుమారి తదితరులు ఇతర ముఖ్య తారాగణంగా నటించారు. సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుందని అంటున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, కెమెరా: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీజిత్ సారంగ్, ఆర్ట్: హరి వర్మ, నృత్యాలు: దయా.కె, వంశీ కాట్రోజు, యాక్షన్: దయా.కె., సుజిత్ సారంగ్, మాటలు: వంశీ కృష్ణ గద్వాల, వశిష్ట శర్మ, అర్జున్, సుమన్ చిక్కల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దయా.కె., సహ నిర్మాత: విక్రమ్.ఎస్.

English summary
Upcoming Telugu action-drama Alias Janaki, coming out July 26, will have a simultaneous online release because its producer Neelima Tirumalasetti believes it will help explore better revenue model. Alias Janaki will be released on Zingreel, an online movie portal. It will be the first Telugu film to have an online screening on the release day.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu