»   » వీడియో: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ ' స్టైల్ లో అనుష్క కత్తి యుద్దం

వీడియో: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ ' స్టైల్ లో అనుష్క కత్తి యుద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వరస పెట్టి ఖాన్ లతో నటిస్తున్న అదృష్టవంతురాలు అయిన హీరోయిన్ ఎవరూ అంటే అనుష్క శర్మ అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె సుల్తాన్ చిత్రం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం...ఆమె బుడాపెస్ట్ లో తన టీమ్ లో కలిసి సుల్తాన్ షూటింగ్ సాంగ్ కోసం వెళ్లింది. హర్యానా రెజ్లర్‌ సుల్తాన్‌ అలీఖాన్‌ జీవితం ఆధారంగా అలి అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అక్కడ ఆమె సరదాగా విన్యాసాలు మొదలెట్టి..తన ఫొటోలు, వీడియోలను ఇనిస్ట్రిగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. అలా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఆమె అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. అదేమిటంటే.

మరో ప్రక్క ... అనుష్క శర్మ హాలీవుడ్‌ ఆరంగ్రేటానికి రంగం సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను ఆమె కొట్టిపారేసింది. హాలీవుడ్‌కు వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పేసింది. తాను నటిగా ఎక్కడ నటించానన్నది ముఖ్యం కాదని... నటిగా ఎక్కడ నుంచి వచ్చానన్నదే ముఖ్యమని అనుష్క చెప్పింది.

అయినా తాను హాలీవుడ్‌కు వెళ్లి సాదాసీదా ఇండియన్ గర్ల్‌గా పాత్రలు చేయనని అమ్మడు అంటోంది. అయితే ఆమె హాలీవుడ్ కు వెళ్లకపోవటానికి కారణం...హాలీవుడ్‌కు వెళితే కోహ్లీకి ఎక్కడ దూరమవ్వాల్సొస్తుందేమోనని అనుష్క భావిస్తుందని... అందువల్లే వెళ్లడానికి రెడీగా లేదని బాలీవుడ్ జనం గుసగుసలాడుకుంటున్నారు.

English summary
A few days ago, Anushka Sharma was in Budapest along with her team to shoot a song for Sultan and the lady kept us hooked on her Instagram profile, with the drool-worthy pictures and videos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu