»   » వచ్చేసింది...ఎంజాయ్ ‌: 'శ్రీమంతుడు' టీజర్‌ (విడుదల)

వచ్చేసింది...ఎంజాయ్ ‌: 'శ్రీమంతుడు' టీజర్‌ (విడుదల)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్‌బాబు నటిస్తున్న 'శ్రీమంతుడు' టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, మహేశ్‌బాబు నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా .. దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన 'శ్రీమంతుడు' టీజర్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Watch Here: Mahesh's Srimanthudu Teaser

మహేష్‌బాబు అప్‌కమింగ్‌ మూవీ శ్రీమంతుడు టీజర్‌ ను ఆదివారం రిలీజ్‌ చేశారు. హీరో కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీమంతుడు మూవీపై మహేష్‌ అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మిత్రులు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'ఆగడు' తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్‌లుక్‌కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

English summary
Mahesh Babu’s “Srimanthudu” is out finally. Today, the teaser is released on the eve of Super star krishna’s birthday.
Please Wait while comments are loading...