»   » సెన్సేషన్ వీడియో : ఫిట్ నెస్ కోసం ఓ రేంజిలో కష్టపడుతోంది

సెన్సేషన్ వీడియో : ఫిట్ నెస్ కోసం ఓ రేంజిలో కష్టపడుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏం చేసినా సెన్సేషనే. ఫిట్ నెస్ కు ప్రయారిటీ ఇచ్చే ఈ బాలీవుడ్ క్వీన్ రీసెట్ గా చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వైరల్ గా దూసుకుపోతోంది.

ఈ వీడియోలో డాన్స్, యోగా, కిక్ భాక్సింగ్ ఇలా కంగనా స్పోర్టీ లుక్ తో రకరకాల ఫిటెనెస్ ఏక్టివిటీస్ తో కనిపిస్తుంది. ఈ వీడియో కంగనా లైఫ్ స్ట్రగుల్, ఆమె ఎలా తన ఫెయిల్యూర్స్ ని అధిగమించింది, ఇన్నర్ స్ట్రెంత్ ని ఎలా పెంపొందించుకుంది అనే విషయాల చుట్టూ నడుస్తుంది.

కంగనా రనౌత్ ప్రస్తుతం విశాల్ భరద్వాజ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా రంగూల్ నటిస్తోంది. షాహిద్ కపూర్, సైఫ్ అలి ఖాన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతోంది.

ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 1940ల నాటి ఓ ప్రేమకథని, ఆ రోజుల్లో ప్రజల జీవన విధానాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు.

Watch: Kangana Ranaut shares her challenging life journey in this video

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బ్రిటీషు సైన్యానికి, సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి మధ్య జరిగే యుద్ధంలో తమ వారినే భారతీయులు ఎలా మట్టుపెట్టారనే ఓ సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో చెప్పనున్నారు విశాల్.

ఈ పీరియడ్ ఫిల్మ్‌లో షాహిద్ కపూర్, సయీఫ్ అలీ ఖాన్‌లు హీరోలు. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కంగన ఒక నటిగా కనిపించనుండడం విశేషం. నటిగా తనను తీర్చిదిద్దిన వ్యక్తితోనే ప్రేమలో పడే పాత్ర ఆమెది. ఇక సినిమాలో ముఖ్యమైన మూడో పాత్ర - ఒక సైనికుడిది కావటం గమనార్హం.

English summary
In the video, Kangana dons the sporty look where she is seen challenging herself with various fitness activities including functional training, dance, yoga and kickboxing. The campaign depicts Kangana's life struggles and how she faced failures with immense inner strength.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu