నాని 'మజ్ను' ఫస్ట్‌లుక్ టీజర్ రిలీజ్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : హీరో నాని నటించిన మజ్ను సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌ను చిత్ర యూనిట్ శ్రావణ శుక్రవారం సందర్భంగా విడుదల చేసింది. విరించి వర్మ(ఉయ్యాల జంపాల) దర్శకత్వంలో జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మజ్ఞు స్టాప్ డ్రింకింగ్, స్టార్ట్ లవింగ్ అనే క్యాప్సన్ పెట్టారు. ఈ సినిమాలో నాని అసిస్టెంట్ డైరక్టర్ గా కనిపించనున్నాడు. టీజర్‌ను మీరూ చూడండి.

చిత్రం వివరాల్లోకి వెళితే...నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్. పి.కిరణ్‌ నిర్మాత. తుదిదశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకి 'మజ్ను' అనే పేరును ఖరారు చేశారు. 29 ఏళ్ల క్రితం నాగార్జున హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'మజ్ను' తెరకెక్కింది. మళ్లీ ఆ పేరు ఇటీవల నాగచైతన్య సినిమా విషయంలో వెలుగులోకి వచ్చింది.

'ప్రేమమ్‌' చిత్రానికి 'మజ్ను' అనే పేరే పెట్టబోతున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ పేరు నాని సినిమాకి కుదిరింది. వరుస విజయాలతో జోరుమీదున్న నాని త్వరలోనే 'మజ్ను'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X