twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మాహిష్మతి’ సామ్రాజ్యంలోకి మీరూ వెళ్లొచ్చు!

    By Srikanya
    |

    హైదరాబాద్‌: అత్యద్బుతమైన టెక్నికల్ నాలెడ్జ్ ని ఉపయోగించి సినిమాను తెరకెక్కించి, హిట్ కొట్డడంలో దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిది పండిపోయారు. ఆ మధ్యన వచ్చిన ఈగ, రీసెంట్ గా వచ్చిన 'బాహుబలి' తెలుగు సినీ చరిత్రలో అద్భుత విజువల్‌ వండర్‌గా నిలిచిపోయాయి.

    హాలీవుడ్ లో 'అవతార్‌' కోసం జేమ్స్‌ కామెరాన్‌ ‌ పాండోరా గ్రహాన్ని సృష్టిస్తే.. 'బాహుబలి' కోసం రాజమౌళి 'మాహిష్మతి' సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇప్పుడు మరో అడుగుముందుకు వేసి వర్చువల్‌ రియాల్టీ(వీఆర్‌)ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు జక్కన్న. ఈ వీడియోని చూస్తే రాజమౌళి వూహా ప్రపంచం ఇలా ఉంటుందా? అని ఆశ్చర్యపోవాల్సిందే.

    స్మార్ట్‌ఫోన్‌, అత్యంత వేగమైన ఇంటర్నెట్‌, వీఆర్‌ బాక్స్‌ ఉంటే చాలు 360 డిగ్రీల కోణంలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని మీరే స్వయంగా చూడవచ్చు అంటున్నారు. 'ఆన్‌ ద సెట్స్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో వర్చువల్‌ రియాల్టీ వీడియోను బాహుబలి చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియో చూసే విధానాన్ని రాజమౌళి ఇలా వివరించారు.

    ఇప్పటికే చాలా మంది 'బాహుబలి' అభిమానులు, రాజమౌళి అభిమానులు, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈ వర్చువల్ రియాల్టి వీడియోని చూసేసారు. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మాధ్యమాల్లో ఈ వీడియోను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరి మీరు ఓ లుక్కేయండి.

    ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే... మొదట దర్శకుడు రాజమౌళి మనకు భవంతిని చూపిస్తూ.. డీటైలింగ్ ఇస్తాడు. ఆ తర్వాత దేవసేన అనుష్క.. తనను పాతికేళ్లు కట్టిపడేసిన స్దలాన్ని చూపించి మరిన్ని వివరాలు చెబుతుంది.

    ఇక కట్టప్ప అయితే.. మొత్తం ఆ ఏరియా అంతా పరిగెడుతూ కూడా వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్ లో రెచ్చిపోయారు. చివరగా వచ్చిన బాహుబలి.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇస్తూ.. చివరకు జై మాహిష్మతీ అంటూ ముగించాడు.

    మొదటి వీడియోను స్వయంగా బాహుబలి ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా పంచుకున్నాడు. 'డార్లింగ్స్.. వీఆర్ ఎక్స్ పీరియన్స్ ద్వారా బాహుబలి2 సెట్స్ లోకి ఓ ట్రిప్ వేయండి. వీలైనంత ఎక్కువ బ్యాండ్ విడ్త్ తో వీఆర్ హెడ్ సెట్స్ ను ఉపయోగించి చూడ్డ ద్వారా వర్చువల్ రియాలిటీ అనుభవించండి' అని చెబుతున్నాడు.

    English summary
    Team Baahubali unveiled the first ever Virtual Reality experience created by AMD Radeon Technologies Group. Prabhas himself shared the VR Experience footage on his Facebook page: 'Darlings! take a trip to the sets of Baahubali 2 with the new VR experience, On The Sets Of Baahubali!! Watch it on the HIGHEST BANDWIDTH possible with your VR headset for the best experience!'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X