»   » వీడియో చూడండి: 'బాహుబలి 2' సెట్స్ కు ఎవరు వచ్చారో , ఇంతకు ముందు పవన్ తో

వీడియో చూడండి: 'బాహుబలి 2' సెట్స్ కు ఎవరు వచ్చారో , ఇంతకు ముందు పవన్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:సూపర్ హిట్ 'బాహుబలి - ది బిగినింగ్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో తమదైన శైలి లో చిత్ర ప్రమోషన్స్ మొదలు పెట్టారు దర్శక,నిర్మాతలు.

కొద్ది రోజుల క్రితం ..శివరాత్రి సందర్భంగా మాహిష్మతి రాజ్యంలో చిన్న ఇంటర్యూ ఇచ్చిన రాజమౌళి, తర్వాత ప్రభాస్ తోను వేరే చోట ఇంటర్వ్యూ ఇప్పించాడు. ఇక బాహుబలి 2 హిందీలోను విడుదల కానుండగా ప్రముఖ క్రిటిక్ మరియు జర్నలిస్ట్ అనుపమ చోప్రాని మాహిష్మతి సామ్రాజ్యంలోకి తీసుకెళ్ళి ఆ రాజ్యానికి సంబంధించిన విశేషాలు తెలియజెప్పాడు రాజమౌళి. ఈ ఇంటర్వూ చూస్తూంటే ఈ చిత్రం బాలీవుడ్ ప్రమోషన్ కోసమే అని అర్దమవుతోంది.


గత ఏడాది ఆమె 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదలకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన అనుపమ ఇంటర్వ్యూకు మంచి పేరొచ్చింది. దేశవ్యాప్తంగా ఆ ఇంటర్వ్యూ పాపులరైంది. ఇక 'బాహుబలి' మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో అనుపమ ఇంటర్వ్యూలు హాట్ టాపిక్ అవుతాయనడంలో సందేహం లేదంటున్నారు అభిమానులు.


ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, కట్టప్ప (సత్యరాజ్), సాబు సిరిల్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించి టీజర్ లా నాలుగు నిమిషాల వీడియో విడుదల చేశారు. మార్చి 6 నుండి పూర్తి వీడియో నెట్ లో అందుబాటులో ఉండనుంది.'ది ఫిల్మ్ కంపానియన్' ఎడిటర్ అనుపమ చోప్రాను 'బాహుబలి' సెట్‌కు ఆహ్వానించిన రాజమౌళి. ఆమెకు మొత్తం మహిష్మతి రాజ్యాన్ని చూపించి.. తనే సొంతంగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు 'బాహుబలి' టీంలో ముఖ్యమైన వ్యక్తులతో ముచ్చటించే అవకాశం కూడా కల్పించటం అంతా హాట్ టాపిక్ గా మారింది . ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది.


ఈ ఇంటర్వూ ఉద్దేశ్యం..'బాహుబలి' సినిమా కథ ముగింపునకు వచ్చిన నేపథ్యంలో దీని గురించి ప్రపంచానికి మరింత తెలియాలని.. అలాగే 'బాహుబలి: ది కంక్లూజన్' ప్రమోషన్లకు కూడా కలిసొస్తుందని రాజమౌళి ఇలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.


ఇక అనుపమ చోప్రా అంటే కేవలం మీడియా పర్శన్ మాత్రమే కాదు...బాలీవుడ్ గ్రేటెస్ట్ ఫిలిం మేకర్లలో ఒకడైన విధు వినోద్ చోప్రా సతీమణి. అనుపమకు దేశవ్యాప్తంగా మంచి పేరు,అభిమానులు ఉన్నారు. . 'ది కంక్లూజన్' విడుదలకు ముందు దీని గురించి మరింత చర్చ జరగాలన్న ఉద్దేశంతో ఈ ఇంటర్వూని ప్లాన్ చేసారు.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా.. 22వ తేదీన తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Renowned Bollywood Film Critic Anupama Chopra of 'Film Companion' landed on the sets of 'Baahubali: The Conclusion'. The Teaser of the interview shows some of the interesting Q&As.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu