»   » అవును మహేష్ బాబే టాప్, అందుకే 1....(వీడియో)

అవును మహేష్ బాబే టాప్, అందుకే 1....(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న '1 నేనొక్కడినే' చిత్రం ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో ఆకర్షణీయంగా, యంగ్ హీరోగా కనిపించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా... నేనొక్కడినే అనే టైటిల్ ముందు '1' అనే పేరు చేర్చడం అభిమానులకు మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది. ప్రస్తుతం టాలీవుడ్ నెం.1 హీరో మహేష్ బాబే అని ముందు నుంచి వాదిస్తూ వస్తున్న ఫ్యాన్స్...........ఈ టైటిల్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస హిట్లతో పాటు పలు అవార్డులు దక్కించుకున్న మహేష్ బాబు నెం.1 స్థానానికి అన్ని విధాలా అర్హుడని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

ఇక్కడ క్లిక్ చేసి '1 నేనొక్కడినే' టీజర్ వీక్షించండి

1 Nenokkadine

ఇక సినిమా వివరాల్లోకి వెళితే..ఈ చిత్రంలో క్రితి సానన్ హీరోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ జూన్ 13 నుంచి యూకేలో 45 రోజుల పాటు ప్లాన్ చేశారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మహేష్ సినిమాకు ఆయన తొలిసారి పనిచేస్తుండటం విశేషం. ఇప్పటివరకూ సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిని మించేలా అద్భుతమైన సంగీతాన్ని దేవిశ్రీ అందించినట్లు సమాచారం. మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary
The industry is buzzing about the news regarding Mahesh Babu's upcoming movie trailer and poster of 1 Nenokkadine. The title and posters are released today on the occasion of superstar Krishna's Birthday. The trailer and poster has received huge response from the fans. The trailer shows Mahesh in the midst of some action sequence. Here is the exclusive first look of Mahesh Babu's 1 Nenokkadine. The movie is directed by Sukumar and music is composed by Devi Sri Prasad. The movie will be released under the prestigious banner 14 Reels.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu