»   »  దారుణమైన పరిస్థితి... పొదల్లో, చెట్ల వెనకే అంతా జరిగేది: శ్రీదేవి షాకింగ్ కామెంట్

దారుణమైన పరిస్థితి... పొదల్లో, చెట్ల వెనకే అంతా జరిగేది: శ్రీదేవి షాకింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు షూటింగ్ స్పాట్లలో సినిమా హీరోయిన్ల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని ప్రముఖ నటి శ్రీదేవి అన్నారు. ఆమె నటించిన 'మామ్' చిత్రం జులై 14న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె 'మామ్' సినిమా విశేషాలతో పాటు తన గత సినీ జీవితానికి సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు.

తాను సినిమాల్లో ప్రవేశించిన కొత్తలో, హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన రోజుల్లో ఔట్ డోర్ షూటింగుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని.... అలాంటి భయంకరమైన పరిస్థితులు ఇపుడు లేవని ఆమె తెలిపారు.

పొదల్లో, చెట్లలోనే అంతా

పొదల్లో, చెట్లలోనే అంతా

తాను హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో ఔట్ డోర్ షూటింగుల్లో బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే పొదల్లో, చెట్ల చాటున మార్చుకునే వాళ్లమని ఆమె తెలిపారు. ఇపుడు ప్రతి షూటింగ్ స్పాట్లో కారావ్యాన్లతో సహా అన్ని ఏర్పాట్లు ఉంటున్నాయని, అప్పటితో పోల్చుకుంటే ఇపుడు పరిస్థితి చాలా బెటర్ అన్నారు.

అనారోగ్యం పాలయ్యేవారం

అనారోగ్యం పాలయ్యేవారం

అప్పట్లో షూటింగ్ లొకేషన్లలో తాను మంచి నీరు కూడా ముట్టుకునేదాన్ని కాదు. ఎందుకంటే అక్కడ వాష్ రూమ్స్ కూడా ఉండేవి కాదు. రెయిన్ డాన్స్ లాంటివి చేసిన సమయంలో అనారోగ్యం పాలయ్యేవారం. అప్పట్లో ఇలాంటివి చేయాలంటే చాలా చిరాకు అనిపించేది అని శ్రీదేవి తెలిపారు.

కూతురు గురించి

కూతురు గురించి

తన కూతురు జాన్వి సినిమా తెరంగ్రేటం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు చెబుతాను అని శ్రీదేవి ఈ విషయాన్ని స్కిప్ చేశారు.

మామ్

మామ్

రవి ఉద్యయార్ దర్శకత్వం వహిస్తున్న ‘మామ్' చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో జులై 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో శ్రీదేవి ‘దేవకి' అనే పాత్రను పోషిస్తోంది. తల్లిసెంటిమెంట్ చుట్టూ సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది.

English summary
In an interview to a leading Television channel, Sridevi made some shocking revelations. Recalling her past shooting experiences, she said, "Vanity van is a blessing for the actresses of today's times. We didn't have such facilities. We used to change clothes behind bushes, trees or even a bus on the sets of our films. I used to avoid drinking water on the sets of the film, as there were no clean washrooms."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu