twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ సినిమా ఫోర్స్ వస్తోంది...టాలీవుడ్ పరిస్థితేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో పరిణామాలు మారుతున్నాయి. తెలంగాణ ప్రకటనతో సంతోషంగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన సినిమా కళాకారులు తమ ప్రత్యేక రాష్ట్రానికి కొత్తగా ఫిల్మ్ చాంబర్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు.

    తెలంగాణ దర్శకుల్లో ఒకరైన ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ తాజా పరిణామాలపై స్పందిస్తూ త్వరలో 'తెలంగాణ సినిమా ఫోర్స్' పేరుతో సపరేట్ సినిమా కమిటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఫిల్మ్ చాంబర్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

    tollywood

    'తెలంగాణ సినిమా ఫోర్స్' ఏర్పాటు గురించి వివరిస్తూ....ప్రస్తుతం ఉన్న సినిమా వ్యవస్థలో తెలంగాణ సినిమాలు సంతృప్తికరంగా విడుదల చేసుకునే పరిస్థితి లేదని, సినిమా పరిశ్రమలో బాగా డబ్బున్న నిర్మాతలు, స్టార్ హీరోల ఆధిపత్యం నడుస్తోందని, తెలంగాణ సినిమా ఫోర్స్ ఏర్పాటు వల్ల తెలంగాణ సినిమాలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. సినిమా డిస్ట్రిబూషన్, ప్రదర్శన వ్యవస్థలో సమూలంగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

    బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ సినిమా పరిశ్రమల మాదిరి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా తెలంగాణ సినిమా పరిశ్రమ ఏర్పాటైతే ఈ ప్రాంత సంస్కృతికి, విలువలకు అద్దం పట్టే సినిమాలను తెరకెక్కిస్తామని దర్శకుడు శంకర్ అంటున్నారు. స్టార్ స్టడ్డెస్ సినిమాలు మేము కోరుకోవడం లేదని తెలిపారు. మాకు స్టూడియోలు, ఫిల్మ్ స్కూల్స్ లేక పోయినా నాచురల్ టాలెంట్ ఉందని తెలిపారు. ఈ విషయాలపై దృష్టి పెట్టాలని తమ ప్రభుత్వాలకు విన్నవిస్తామని తెలిపారు.

    టాలీవుడ్ పరిస్థితి ఏమిటి?
    తెలంగాణ విభజనతో రాష్ట్రంలో మారిన పరిస్థితుల కారణంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో మెజారిటీ వర్గం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడంతో....తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ వైజాగ్ తరలి వెళ్లే అవకాశం ఉందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ వైజాగ్ లో ఇప్పటికే పలు సినీ స్టూడియోలు కూడా వెలిసాయి.

    అయితే తెలుగు సినిమా పరిశ్రమకు కావాల్సిన చెందిన మౌళిక సదుపాయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగబోతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిశ్రమ రెండుగా చీలబోతోందా? చీలితే రెండు ఫిల్మ్ చాంబర్ల మనుగడ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు గుండెకాయలాంటి నైజాం ఏరియా సినిమా మార్కెట్ ఎవరి చేతుల్లో వెలుతుంది? అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    స్టార్స్ ఏమంటున్నారు?
    ప్రస్తుతం పరిశ్రమలో రెండు ప్రాంతాల కళాకారులు తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తెలుగు సినీ కళాకారులు తటస్థవైఖరి కొనసాగిస్తున్నారు. తెలుగు కళాకారులమంతా ఒక్కటే అంటున్నారు. అడ్డుగోడల కన్నా ప్రేమాభిమానాలే మిన్న అంటున్నారు. రెండు ప్రాంతాల అభిమానులు ఆదరణతోనే ఈ స్థాయికి ఎదిగామని అంటున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా...ఎవరి అభిప్రాయం ఏదైనా.....కళలకు, కళాకారులకు హద్దులు, సరిహద్దులు లేవు... కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలుండవు అనే విషయాన్ని అందరూ గుర్తించాలని ఆశిద్దాం.

    English summary
    Filmmakers from the soon-to-be new state of Telangana have expressed interest in setting up a separate film committee called 'Telangana Cinema Force' to formulate new guidelines to defend the process of filmmaking and exhibition in the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X