»   » షాక్‌: రేపే రిలీజ్... అంత గొప్ప సినిమా కాదని మీడియాతో

షాక్‌: రేపే రిలీజ్... అంత గొప్ప సినిమా కాదని మీడియాతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: సినిమా ఫ్లాఫ్ అయ్యాక కూడా తాము అద్బుతం చేసామని నమ్మించే ప్రయత్నం చేస్తూంటారు మన స్టార్ హీరోలు,నిర్మాతలు,హీరోయిన్స్,దర్శకులు. అయితే రేపు రిలీజ్ అవుతున్న తన వెల్‌కం బ్యాక్‌ సినిమా అంత గొప్ప సినిమా కాదని అనీల్ కపూర్ తేల్చి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తన తదుపరి చిత్రం వెల్‌కం బ్యాక్‌ గురించి మీడియాతో మాట్లాడుతూ.. 2007లో వచ్చిన వెల్‌కం సినిమాకి ఇది సీక్వెల్‌గా వస్తోందని, ఇందులో తన పాత్ర పేరు మజ్ను భాయ్‌ అని చెప్పారు. సన్నివేశాలు, కథనంతో తప్పకుండా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది కాని ఇదేమంత గొప్పచిత్రం కాదని సూటిగా చెప్పేశారు. ఈ సినిమాలో జాన్‌ అబ్రహం, శృతిహాసన్‌, నానాపటేకర్‌, పరేశ్‌రావల్‌లు ముఖ్యపాత్రల్లో నటించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'Welcome Back' is not a great film: Anil Kapoor

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నటజీవితం తర్వాత ఇప్పటికీ అనిల్‌కపూర్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. జీవితం పట్ల తనకున్న ఆశావహదృక్పథమే తన ఆరోగ్యరహస్యం అంటారాయన. వయసు గురించి, తన హోదా గురించి భ్రమల్లో బతకనని తేల్చి చెప్పారు. వాస్తవంలో జీవిస్తానని, సంతోషంగా, తృప్తిగా ఉంటానని తెలిపారు.

మరో ప్రక్క...

దేశరాజధాని దిల్లీలో 'వెల్‌కమ్‌ బ్యాక్‌' చిత్ర బృందం సందడి చేశారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు జాన్‌ అబ్రహాం, శ్రుతిహాసన్‌, అనిల్‌కపూర్‌ పాల్గొని సందడి చేశారు. సెప్టెంబరు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అనీస్‌ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

జాన్ అబ్రహం మాట్లాడుతూ...

'హౌస్‌ఫుల్‌', 'గరంమసాలా' చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు జాన్‌ అబ్రహం. ఆయనకు మొదట హస్య ప్రధాన సన్నివేశాల్లో నటించగలనా అన్న సందేహం కలిగేదట. తరువాత రోజురోజుకి ఆ భయం పోయి చక్కగా పాత్రలో ఇమిడిపోగలిగానని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సన్నివేశాల్లో నటించడానికి తనకు సహాయపడి సలహాలిచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహించిన 'వెల్‌కం బ్యాక్‌' చిత్రంలో ఆయన నటించారు.

English summary
Anil Kapoor 's looking forward to entertaining the audience with 'Welcome Back', in which he reprises his role as Majnu Bhai from the 2007 entertainer 'Welcome'.He says that while it's "not a great film", but definitely a "happy and entertaining" one.
Please Wait while comments are loading...