»   » అల్లు అర్జున్ బ్యాడ్ లక్ ని 'బద్రీనాథ్' దాటేస్తుందా?

అల్లు అర్జున్ బ్యాడ్ లక్ ని 'బద్రీనాథ్' దాటేస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్,వి వి వినాయిక్ ల కాంబినేషన్ లో రెడీ అయిన 'బద్రీనాథ్' చిత్రం ఈ వారంలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంలో చాలామంది వరసగా ఆర్య 2, వరుడు చిత్రాలు ప్లాప్,వేదం యావరేజ్ తో ఉన్న అల్లు అర్జున్ కి బ్యాడ్ టైం పోయి బద్రీనాధ్ తో హిట్టిస్తాడా అనేది హాట్ టాపిక్ గా మారింది.అయితే ఆ టాపిక్ పాజిటివ్ గానే సాగుతోంది.ఎందుకంటే దాదాపు అన్నీ సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడుగా వి వి వినాయిక్ కి,సంగీత దర్శకుడు కీరవాణికీ పేరుంది.వీరద్దరూ ఈ చిత్రానికి పనిచేయటంతో ఈ చిత్రంపై హోప్స్ ఉన్నాయని చెప్తున్నారు.

అందులోనూ భారీ బడ్జెట్ చిత్రం కావటం,సొంత బ్యానర్ లో చేసన చిత్రం కావటం కూడా సినిమాపై నమ్మకం పెంచే అంశాలుగా వర్ణిస్తున్నారు.దానికి తోడు వరస హిట్స్ తో దూసుకు పోతున్న తమన్నా హీరోయిన్ కావటం కూడా కలిసివచ్చే అంశం అని చెప్తున్నారు.అయితే ఈ చిత్రం కూడా ఎన్టీఆర్ చేసిన శక్తి లాంటిదే కావటం మా్త్రం కాస్త నెగిటివ్ ఆలోచించాల్సిన సంగతి అంటున్నారు.ఏదైమైనా ఈ సారి బన్నీ హిట్ కొట్టడం మాత్రం ఖాయం అనేది అభిమానుల మాట.

English summary
Bad Luck is the key factor in defining the success of his upcoming flick 'Badrinath'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu