»   » పవన్ కళ్యాణ్ "గోపాలుడు" ఫొటో బానే ఉంది గానీ సినిమా సంగతేమిటి?

పవన్ కళ్యాణ్ "గోపాలుడు" ఫొటో బానే ఉంది గానీ సినిమా సంగతేమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సర్దార్ డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాన్ కి ఖచ్చితంగా ఇంకో హిట్ సినిమా చేయాల్సిన అవసరం ఏర్పడింది. 2019 ఎలక్షన్ల లోపే తాను చేయాల్సిన సినిమాలని పూర్తి చేసేసాతననీ ఆతర్వాత మళ్ళీ నటన వైపు రాను అనికూడా చెప్పి న తరవాత దాదాపు మూడు సినిమాలకి కమిట్ అయ్యాడు. అయితే వీటిలో ఇప్పుడు మొదటి సినిమా నే ఇంకా మొదలవ్వలేదు.

ఎస్‌జె సూర్యతో పవన్‌కళ్యాణ్‌ హీరోగా సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఏమైందిఓ ఏమో గానీ నేనూ నటనలోకి వస్తున్నా అంటూ సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత సూర్య స్థానంలోకి 'గోపాల గోపాల' ఫేం డాలీ వచ్చాడు. టైటిల్ హుషారు కాదు కడప కింగ్ అన్నాడు కథలో మార్పులు అన్నాడు.

pawan kalyan

హడావుడి పూర్తిగా మొదలు కాకముందే ఇక అంతా సవ్యంగానే ఉంటుందీ అనుకున్న సమయం లో మళ్ళీ సీన్ రిపీట్ డాలీ కూడా తప్పుకున్నట్టే. రేసులో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పేరు విన్పించింది. కాదు కాదు, సంపత్‌ నందిని పిలిచాడట, హరీష్‌ శంకర్‌ని అడిగాడట.. అంటూ పవన్‌ గురించి కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ వచ్చాయి. మొత్తానికి ఇపుడీ సినిమా అటకెక్కినట్టే అనుకుంటున్నారు.

అసలు పవన్‌, తదుపరి సినిమా చేస్తాడా లేదా.? అన్నది సస్పెన్స్‌గా మారిన తరుణంలో, నిర్మాత శరద్‌ మరార్‌.. పవన్‌తో సినిమా విశేషాల్ని ముచ్చటించేందుకు ఫామ్‌ హౌస్‌కి వెళితే, ఇదిగో ఇలా పవన్‌కళ్యాణ్‌ దర్శనమిచ్చాడంటూ ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఫొటో అదిరిందంటూ అభిమానులు సంబరం చేసుకుంటున్నారు సరేగానీ, ఇంతకీ సినిమా ఏమయ్యిందట.? నిర్మాత శరద్‌ మరార్‌ కూడా క్లారిటీ ఇవ్వకపోతే, ఈ సినిమా గురించి ఎవరు స్పష్టతనివ్వగలరు.?

English summary
Actor Pawan Kalyan's yet-untitled upcoming Telugu film,which was reportedly the official remake of Ajith Kumar-starrer Tamil blockbuster Veeram is stopped?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu